Hanshita Reddy : ఇంట్లోనే తల్లి విగ్రహం ఏర్పాటు చేసిన దిల్ రాజు కుమార్తె హన్షిత

dil raju daughter
  • ఇంట్లోనే తల్లి విగ్రహం ఏర్పాటు చేసిన దిల్ రాజు కుమార్తె హన్షిత

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుమార్తె హన్షిత మదర్స్ డే సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ భావోద్వేగమైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే, హన్షిత తల్లి అనిత గుండెపోటుతో కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. తల్లి ఇకలేను అన్న సంగతి ఎంత కఠినమైనదైనా, ఆమె జ్ఞాపకాలను చిరకాలం సజీవంగా ఉంచేందుకు హన్షిత తన ఇంట్లోనే తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. మదర్స్ డే సందర్భంగా ఆ విగ్రహాన్ని హత్తుకుంటూ తల్లి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరిచింది.

ఈ సందర్భంగా హన్షిత తల్లి విగ్రహం ముందు తన కూతురు ఇషితా, తాతమ్మతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ “నాలుగు తరాలు” అని క్యాప్షన్ జత చేసింది. ఆ ఫోటో చూసిన నెటిజన్లు హన్షిత తల్లి పట్ల చూపిన అనురాగాన్ని ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతం హన్షిత నిర్మాతగా పలు సినిమాలు రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, అనిత మృతి తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్న దిల్ రాజు, లాక్‌డౌన్ సమయంలో తేజస్వీ (వైఘా రెడ్డి)తో రెండో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

Read : Pawan Kalyan : ప‌వ‌న్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’పై కీల‌క అప్‌డేట్‌

Related posts

Leave a Comment