Prabhas : పెళ్లి వార్తలను ఖండించిన ప్రభాస్ 

prabhas
54 / 100
  • పెళ్లి వార్తలను ఖండించిన ప్రభాస్

 

హైదరాబాద్‌కు చెందిన అమ్మాయితో పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి జరగబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందంటూ, త్వరలోనే వివాహం జరగనున్నట్లు పుకార్లు వైరల్ అవుతున్నాయి.

బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోలో రామ్ చరణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలను నెటిజన్లు ఈ వార్తలతో కలిపి వైరల్ చేస్తున్నారు. గణపవరంకు చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని ఆ షోలో రామ్ చరణ్ చెప్పిన మాటలు నిజమయ్యాయని, ఆ అమ్మాయి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడిందని, ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయని సోషల్ మీడియాలో పోస్టులు షేర్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభాస్ టీమ్ స్పందించింది. ఆయన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి పుకార్లను నమ్మొద్దని, ఏదైనా అధికారిక సమాచారం ఉంటే తామే ప్రకటిస్తామని తెలిపింది. 45 ఏళ్ల ప్రభాస్ ఇప్పటికీ బ్యాచిలర్‌గా ఉన్నాడు. అయితే, త్వరలోనే ఆయన వివాహం జరుగుతుందని ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివర్లో ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

 

Read :Malavika Mohanan : షూటింగ్‌లో ప్రభాస్‌ను చూసి తాను ఆశ్చర్యపోయాను

 

Related posts

Leave a Comment