-
ఓటీటీ లో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘నిజార్ కుడై’
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ వేదికలపై మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి జానర్లో దేవయాని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘నిజార్ కుడై’. శివ ఆర్ముగం దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 9న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో విజిత్, కన్మణి మనోహర్, రాజ్ కపూర్, ఇళవరసు వంటి ప్రముఖులు ముఖ్య పాత్రలు పోషించారు.
థియేటర్లలో విడుదలైన 20 రోజులకే ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ నెల 30వ తేదీ నుంచి ‘ఆహా తమిళ్’లో స్ట్రీమింగ్ కానుందని అధికారిక ప్రకటన వెలువడింది. నరేన్ బాలకుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో, దేవయాని తన నటనతో మంచి మార్కులు కొట్టేసినట్టు విమర్శకుల అభిప్రాయం.
కథ పరంగా:
నిరంజన్ మరియు లాన్సీ అనే దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వారికి పుట్టిన ముద్దుల కూతురు నీలా చిన్నప్పటి నుంచే ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంది. దాంతో ఆమెకు ప్రత్యేక శ్రద్ధ అవసరమవడంతో, జ్యోతి అనే కేర్‌టేకర్‌ను నియమిస్తారు. అయితే, ఓ రోజు నీలా అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది.
ఆమెకు ఏమైపోయింది? ఆ ఘటనకు బాధ్యులు ఎవరెవరు? నిరంజన్ దంపతులు దానికి ఎలా ప్రతిస్పందించారు? అనే ప్రశ్నల చుట్టూ కథ నడుస్తూ, థ్రిల్ తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్లను కలగలిపి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.