Harihara Veeramallu | హరిహర విరమల్లు నుంచి ‘తార తార నా క‌ళ్లు’ సాంగ్ విడుదల

nidhi aggarwal
51 / 100
  • హరిహర విరమల్లు నుంచి ‘తార తార నా క‌ళ్లు’ సాంగ్ విడుదల

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం హరిహర వీరమల్లు నుంచి మరో పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటివరకు విడుదలైన ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’, ‘అసుర హననం’ పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ చిత్రంలోని హీరోయిన్ నిధి అగర్వాల్ పాటను విడుదల చేశారు. ‘తార తార నా కళ్ళు.. వెన్నెల పూత నా ఒళ్లు’ అంటూ సాగే ఈ పాటకు శ్రీహర్ష లిరిక్స్ అందించగా, లిప్సికా మరియు ఆదిత్య అయ్యంగార్ ఆలపించారు. ఈ పాటలో నిధి అగర్వాల్ తన అందంతో ఆకట్టుకుంది.

ఈ సినిమా రెండు పార్టులుగా రూపొందుతోంది. మొదటి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో జూన్ 12న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషు సేన్‌గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో, మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ. దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Read : Pawan Kalyan : ఏఎం రత్నం, డీవీవీ దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ తో పవన్ భేటీ!

Related posts

Leave a Comment