Ram Charan | రామ్ చరణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా

ramcharan trivikram combo
54 / 100
  • రామ్ చరణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రాబోతోందన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ సంచలనమైన అప్‌డేట్ సినీ వర్గాల్లో కూడా విశేష ఆసక్తి కలిగిస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది. ఈ సినిమా పూర్తైన వెంటనే, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోందని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో ఒక సినిమా అధికారికంగా ఇప్పటికే ప్రకటించబడింది. ఈ ప్రాజెక్ట్‌తో పాటు త్రివిక్రమ్ సినిమా కూడా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయని సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్, సీనియర్ హీరో వెంకటేశ్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ తర్వాతనే రామ్ చరణ్ సినిమాకు శ్రీకారం చుట్టనున్నట్లు టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ చర్చలు ప్రారంభమయ్యాయని, చెర్రీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ బుల్లెటిన్లు చెబుతున్నాయి.

ఈ మాస్ అండ్ మాజిక్ కాంబినేషన్‌పై ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ బ్రాండెడ్ డైలాగ్స్‌, రామ్ చరణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కలసి వస్తే, అది ఓ సెన్సేషనల్ సినిమా అవుతుందన్నది సినీ వర్గాల నమ్మకం. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఒకవేళ ఈ కాంబో ఫైనల్ అయితే, బాక్సాఫీస్ వద్ద రికార్డులు మళ్లీ తిరగరాయడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ జరుగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి కానీ, ఇప్పటినుంచే ఈ కాంబినేషన్‌పై హైప్ మామూలుగా లేదు!

Related posts

Leave a Comment