-
విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ఫ్యామిలీ లండన్ ప్రయాణం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోబోతున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా, విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు రామ్ చరణ్ తన కుటుంబంతో కలిసి లండన్‌కి పయనమయ్యారు.
వివరాల్లోకి వెళితే, మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖుల మైనపు విగ్రహాలకు పెట్టింది పేరు. ఇప్పుడు, టాలీవుడ్ నుంచి రామ్ చరణ్‌కి ఈ గౌరవం దక్కటం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం. ఈ విగ్రహావిష్కరణ వేడుకకు రామ్ చరణ్‌తో పాటు ఆయన భార్య ఉపాసన కామినేని కొణిదెల, కూతురు క్లీంకార కొణిదెల, తండ్రి మెగాస్టార్ చిరంజీవి మరియు తల్లి సురేఖ లండన్‌కి చేరుకున్నారు.
‘RRR’ చిత్రంతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రామ్ చరణ్‌కి ఇది మరొక మైలురాయి. మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరబోయే ఆయన విగ్రహాన్ని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రముఖ మ్యూజియంలో మైనపు విగ్రహం దక్కించుకున్న కొద్దిమంది భారతీయుల జాబితాలో రామ్ చరణ్ చేరటం విశేషం.