Teja Sajja | విజువల్ వండ‌ర్‌గా తేజా సజ్జా “మిరాయ్” టీజ‌ర్

mirai
18 / 100
  • విజువల్ వండ‌ర్‌గా తేజా సజ్జా “మిరాయ్” టీజ‌ర్

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా పాన్ ఇండియా సినిమా ‘మిరాయ్’. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. “జరగబోయేది మారణహోమం… శిధిలం కాబోతుంది అశోకుడి ఆశయం” అంటూ ప్రారంభమైన ఈ టీజర్, మొదటి క్షణం నుంచే ఆసక్తిని రేపుతోంది.

“నాలుగు పుస్తకాలు, వంద ప్రశ్నలు, ఒక కర్ర” అంటూ తేజ సజ్జ పలికిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మంచుకొండల్లో ఒక భారీ పక్షి నుంచి తప్పించుకునే సన్నివేశాలు, రైలుపై పరుగులు తీసే యాక్షన్ శాట్లు థ్రిల్ కలిగిస్తున్నాయి. టీజర్‌లో చూపిన విజువల్ ఎఫెక్ట్స్ సినిమా స్థాయిని భారీగా రెట్టింపు చేశాయి.

మొత్తంగా ఈ టీజర్‌ ఊహించని విధంగా, మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా రూపొందించబడిందని చెప్పవచ్చు. పాన్ ఇండియా స్థాయిలో బిగ్ స్క్రీన్ స్పెషల్స్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది పెద్ద అంచనాలు కలిగిస్తోంది.

నెగిటివ్ షేడ్‌లో కనిపించిన మంచు మనోజ్, తన కొత్త అవతారంతో ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక ‘హను మాన్’ తర్వాత తేజ సజ్జ మరోసారి బలమైన కంటెంట్‌ను ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. ఈ విజువల్ వండర్ సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.

Read : Harihara Veeramallu | హరిహర విరమల్లు నుంచి ‘తార తార నా క‌ళ్లు’ సాంగ్ విడుదల

Related posts

Leave a Comment