Vishal : కూవాగం వేడుకల్లో నటుడు విశాల్‌కు అస్వస్థత

vishal1
  • కూవాగం వేడుకల్లో నటుడు విశాల్‌కు అస్వస్థత

ప్రముఖ తమిళ నటుడు విశాల్ అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కూవాగం గ్రామంలో జరుగుతున్న ప్రసిద్ధి చెందిన కూత్తాండవర్ ఆలయ చిత్తిరై ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో ఆదివారం రాత్రి ట్రాన్స్‌జెండర్ల కోసం నిర్వహించిన ‘మిస్ కూవాగం 2025’ అందాల పోటీలో పాల్గొన్న విశాల్, కార్యక్రమం మధ్యలో వేదికపై స్పృహ కోల్పోయి కిందపడిపోయారు.

ఈ అనూహ్య పరిణామంతో అక్కడ ఉన్నవారు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు, అభిమానులు ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. కొద్దిసేపటికి ఆయన తిరిగి చైతన్యం పొందారు. అనంతరం, మెరుగైన వైద్యం కోసం అక్కడే ఉన్న రాష్ట్ర మాజీ మంత్రి పొన్ముడి సహాయంతో విశాల్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా, ఇటీవల విశాల్ ఆరోగ్యంపై కొన్ని అనుమానాలు కలుగజేసే వార్తలు వెలువడ్డాయి. ‘మద గజ రాజా’ ప్రచార కార్యక్రమాల్లో ఆయన కాస్త నీరసంగా కనిపించడం, ఆరోగ్య సమస్యలపై అభిమానుల్లో ఆందోళనను రేపింది. అయితే అప్పట్లో ఆయన బృందం, కేవలం తీవ్రమైన జ్వరమే కారణమని స్పష్టం చేసింది. తాజా ఘటనతో విశాల్ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Read : Trivikram : సిరివెన్నెల గారి కారణంగానే తనకు పాటలంటే ఇష్టం ఏర్పడింది : త్రివిక్రమ్ శ్రీనివాస్

Related posts

Leave a Comment