-
పవర్ స్టార్ ‘హరి హర వీర మల్లు’ విడుదల వాయిదా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరి హర వీర మల్లు’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ నెల 12న విడుదలయ్యే అవకాశం ఉందని భావించినప్పటికీ, కొన్ని అనివార్య కారణాలతో ఆ తేదీ వాయిదా వేయబడింది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసి కొత్త విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. “జూన్ 12న చిత్రాన్ని విడుదల చేయాలని గట్టి ప్రయత్నాలు చేశాం. కానీ, చిత్రాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కొంత సమయం తీసుకోవాల్సి వస్తోంది,” అని వారు తెలిపారు.
చిత్ర బృందం చెప్పిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
-
అభిమానుల అచంచలమైన ఆదరణకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
-
ప్రతి ఫ్రేమ్‌ని శ్రద్ధగా రూపొందిస్తూ, ఓ మహత్తరమైన సినిమాను అందించేందుకు నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.
-
పలు సోషల్ మీడియా వేదికల్లో వాస్తవానికి భిన్నంగా ప్రచారంలో ఉన్న వార్తలు అవాస్తవం. దయచేసి అధికారిక హ్యాండిల్స్ నుంచే సమాచారం తెలుసుకోవాలని విజ్ఞప్తి.
ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. ట్రైలర్‌తో పాటు కొత్త విడుదల తేదీ కూడా ప్రకటించనున్నారు. “మీ మద్దతు, ప్రేమ, ఓర్పుకు మా కృతజ్ఞతలు. తుపాను వస్తోంది… చరిత్ర సృష్టించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం,” అంటూ బృందం పేర్కొంది.
సినిమా విశేషాలు:
-
సంగీతం: ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం.కీరవాణి
-
నిర్మాత: ఎ. దయాకర్ రావు
-
సమర్పణ: ఏఎం రత్నం, మెగా సూర్య ప్రొడక్షన్స్
-
కథానాయిక: నిధి అగర్వాల్
-
ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం విజువల్స్, సంగీతం, నటన పరంగా ప్రేక్షకులకు ఓ విశిష్టమైన అనుభూతిని అందించనుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.Read : Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా – విడుదల తేదీపై సందిగ్ధత