-
లాయర్‌గా ప్రియమణి అదరగొట్టేందుకు రెడీ – ‘గుడ్ వైఫ్’ వెబ్ సిరీస్‌పై భారీ అంచనాలు
ఓవైపు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే, మరోవైపు వెబ్ సిరీస్‌లతోనూ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం కొనసాగిస్తోంది నటి ప్రియమణి. తెలుగు ఓటీటీలో విడుదలైన ఆమె సినిమా ‘భామ కలాపం‘ మంచి స్పందనను పొందింది. అంతేకాదు, హిందీలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మేన్‘ సిరీస్ ఆమెను దేశవ్యాప్తంగా ఫేమస్ చేసింది. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన మరో ఆసక్తికర వెబ్ సిరీస్ ‘గుడ్ వైఫ్‘ విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సిరీస్ అమెరికాలో విజయవంతమైన ఓ షో ఆధారంగా తెరకెక్కించబడింది. తొలుత తమిళంలో నిర్మించబడిన ఈ సిరీస్, త్వరలో తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రియమణితో పాటు ప్రముఖులు రేవతి, సంపత్ రాజ్, ఆరి అర్జునన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కథ విషయానికొస్తే… ప్రియమణి ఈ సిరీస్‌లో ఒక లాయర్‌గా కనిపించనున్నారు. ఓ సమయంలో లాయర్‌గా పనిచేసిన ఆమె, ఆపై భర్తతో కలిసి, ఇద్దరు పిల్లలతో ప్రశాంత జీవితం గడుపుతూ ఉంటుంది. అనుకోని తరుణంలో ఆమె భర్త సెక్స్ స్కాండల్‌లో చిక్కుకోవడంతో ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది. కుటుంబాన్ని రక్షించుకోవాలనే కర్తవ్యం దృష్టిలో పెట్టుకుని ఆమె మళ్లీ కోర్టు మెట్లు ఎక్కుతుంది. అక్కడి నుంచి కథ తీరే తీరులు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేయనున్నాయి.
Read : Devayani : ఓటీటీ లో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘నిజార్ కుడై’