Hit 3 | 4 రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 101కోట్ల‌ పైగా కలెక్ష‌న్స్‌ సాధించిన హిట్ 3

  • 4 రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 101కోట్ల‌ పైగా కలెక్ష‌న్స్‌ సాధించిన హిట్ 3

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘హిట్ 3’ (హిట్: ది థర్డ్ కేస్), హిట్ సిరీస్‌లో మూడో భాగంగా శైలేశ్ కొలను దర్శకత్వంలో రూపొందింది. మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. విడుదల రోజునే ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది.

ఈ విజయాన్ని పురస్కరించుకుని, చిత్రబృందం ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా అధికారికంగా ప్రకటించింది. “సర్కార్ సెంచరీ – 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 101 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు!” అంటూ ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో నానికి జోడీగా ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటించగా, సంగీతాన్ని మిక్కీ జే మేయర్ అందించారు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై, యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు.

https://publish.twitter.com/?url=https://twitter.com/walpostercinema/status/1919289047849070941#

Read : Nani : హిట్ 3 మూవీ ట్రైలర్ విడుదల

Related posts

Leave a Comment