పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ గ్రీస్‌లో మిగిలిన రెండు పాటల చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ క్రమంలో సినిమాలో హీరోయిన్‌లలో ఒకరైన మాళవిక మోహనన్, తన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాల్లో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రీస్‌లోని అందమైన లొకేషన్‌లో ‘ది రాజా సాబ్’ పోస్టర్ డిజైన్ ఉన్న డ్రెస్ ధరించి పోజులిచ్చిన ఆమె, ఆ ఫోటోకి “Lights, Camera, Greece!” అనే క్యాప్షన్ ఇచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే — ఒక రోజు ముందే దర్శకుడు మారుతి కూడా ఇలాగే సినిమా పోస్టర్ ప్రింట్ ఉన్న టీ-షర్ట్ ధరించి ఫోటోను పోస్ట్ చేశారు.…
Read MoreAuthor: Raghu
‘మహారాణి’ సీజన్ 4: హ్యూమా ఖురేషి మరోసారి రాజకీయ రంగంలో! | నవంబర్ 7 నుంచి సోనీలివ్‌లో
థ్రిల్లర్ జానర్‌కి చెందిన కంటెంట్ ఏ భాషలో వచ్చినా ప్రేక్షకుల నుంచి ఎప్పటికప్పుడు మంచి ఆదరణ పొందుతోంది. క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్, మిస్టరీ థ్రిల్లర్‌లాగే, ఇప్పుడు పొలిటికల్ థ్రిల్లర్‌ల కథలు కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ తరహా సిరీస్‌లు ప్రతి సీజన్‌తో తమ స్థాయిని మరింతగా పెంచుకుంటూ వస్తున్నాయి. ఆ వరుసలో నిలిచే వెబ్ సిరీస్ ‘మహారాణి’. హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక సాధారణ గృహిణి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే ప్రయాణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందనను రాబట్టాయి. ఇప్పుడు, ఆ విజయాన్ని కొనసాగిస్తూ ‘మహారాణి – సీజన్ 4’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో, ముఖ్యమంత్రిగా కొనసాగిన…
Read Moreఈటీవీ విన్ ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’ మూవీ రివ్యూ!
‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’ – ప్రేమకు మేఘాల ముద్ర ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ డ్రామా ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’. ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కాగా, నరేశ్ అగస్త్య – రాబియా ఖాతూన్ జంటగా నటించారు. విపిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం అక్టోబర్ 9 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది. కథ: వరుణ్ (నరేశ్ అగస్త్య) శ్రీమంత కుటుంబంలో పుట్టిన యువకుడు. అతని తండ్రి మహేంద్ర (సుమన్) పెద్ద వ్యాపారవేత్త. తల్లి (ఆమని)తో అతనికి అనుబంధం ఎక్కువ. చిన్ననాటి నుంచే సంగీతం పట్ల ఆకర్షణ కలిగిన వరుణ్‌కి ఆ అభిరుచి నాయనమ్మ (రాధిక) ప్రభావంతో ఏర్పడింది. ఆమె మార్గదర్శకత్వంలో కొంతవరకు సంగీతం నేర్చుకున్న వరుణ్, ఫారిన్‌లో చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించిన తర్వాత కూడా సంగీతాన్ని…
Read Moreఅమెజాన్ ప్రైమ్ లో ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ
‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ రివ్యూ మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రాన్ని విజయ్ పాల్ రెడ్డి నిర్మించారు. సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ సింహా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో విడుదలై, ఇప్పుడు అక్టోబర్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదల సమయంలో దర్శకుడు రిలీజ్ చేసిన వీడియో కారణంగా టైటిల్‌కి విపరీతమైన దృష్టి లభించింది. కథ: శ్యామ్ (సత్యరాజ్) ఒక మానసిక వైద్య నిపుణుడు. ప్రమాదంలో తన కొడుకు–కోడలు మరణించడంతో, మనవరాలు నిధి (14 ఏళ్లు)తో కలిసి హైదరాబాద్‌లో జీవిస్తుంటాడు. ఒకరోజు ఆమెకు ‘బార్బరిక్’ అనే నాటకం చూపిస్తాడు. మూడు బాణాలతో న్యాయాన్ని సాధించే బార్బరికుడు ఆమెను లోతుగా ప్రభావితం చేస్తాడు. ఇక హైదరాబాద్‌లో వాకిలి పద్మ (ఉదయభాను) అనే డాన్ చెలామణి అవుతుంది.…
Read Morekeerthy-suresh | వివాహానికి పిలవలేకపోయానని జగపతిబాబుకు కీర్తి సురేశ్ క్షమాపణలు
ప్రముఖ నటి కీర్తి సురేశ్, సీనియర్ నటుడు జగపతిబాబుకు క్షమాపణలు తెలిపారు. తన వివాహానికి ఆయనను ఆహ్వానించలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో **‘జయమ్ము నిశ్చయమ్మురా’**లో ఇటీవల కీర్తి సురేశ్ పాల్గొని తన వివాహానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను, ఆంథోనీ తటిల్ దాదాపు పదిహేనేళ్లుగా ప్రేమలో ఉన్నామని ఆమె చెప్పారు. ఇరువురు కుటుంబాల అంగీకారంతోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని వివరించారు. తటిల్ ఆరేళ్లపాటు ఖతార్‌లో ఉన్నారని, ఆయన తిరిగి వచ్చిన తర్వాతే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. సుమారు నాలుగేళ్ల క్రితం ఈ విషయం ఇంట్లో చెప్పగా, తన తండ్రి వెంటనే అంగీకరించారని చెప్పారు. అయితే, తన కుటుంబ సభ్యులకు చెప్పే ముందు ఈ విషయం జగపతిబాబుతో పంచుకున్నానని కీర్తి గుర్తుచేశారు. చిత్ర పరిశ్రమలో…
Read MoreKantara 1 | 9 రోజుల్లో రూ.509 కోట్లు వసూలు చేసిన ‘కాంతార: చాప్టర్ 1’
కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం, విడుదలైన తొలి రోజు నుంచే వసూళ్ల వర్షం కురిపిస్తూ రికార్డులను తిరగరాస్తోంది. తాజాగా సినిమా యూనిట్ ప్రకటించిన వివరాల ప్రకారం, ‘కాంతార: చాప్టర్ 1’ కేవలం 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.509 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దసరా పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం, అంచనాలకు మించి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సినిమా విజయోత్సవంగా, చిత్ర బృందం ఈ భారీ వసూళ్ల వివరాలతో కూడిన కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ‘కాంతార’ మొదటి భాగానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ ప్రీక్వెల్, ప్రేక్షకులను తన సౌండ్, విజువల్స్, కథా శైలితో ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా,…
Read MoreBunny Vas | బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై నిర్మాత బన్నీ వాసు స్పందన
నిర్మాత బండ్ల గణేశ్ నోరు విప్పితే సంచలనం ఖాయం. ఆయన వ్యాఖ్యలు తరచూ వివాదాలకు దారి తీస్తుంటాయి. తాజాగా ‘లిటిల్ హార్ట్స్’ సినిమా విజయోత్సవ సభలో ఆయన చేసిన పరోక్ష వ్యాఖ్యలు మరోసారి తెలుగు సినిమా పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. ఆ వ్యాఖ్యల వల్ల తాను తీవ్రంగా బాధపడ్డానని, ఆ వేడుకలోని సంతోష వాతావరణం పూర్తిగా మాయమైందని నిర్మాత బన్నీ వాసు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఆవేదన వ్యక్తం చేశారు. వివాదానికి కారణమైన వ్యాఖ్యలు ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ మీట్‌లో బండ్ల గణేశ్ మాట్లాడుతూ, “ఇండస్ట్రీలో అందరూ మెగాస్టార్ బావమరిదిలా, స్టార్ కమెడియన్ కొడుకులా, ఐకాన్ స్టార్ తండ్రిలా పుట్టరు. అది కొందరికే దక్కే అదృష్టం. మిగిలిన వాళ్లు ఎంత కష్టపడినా చివరికి పేరు మాత్రం వాళ్లకే వెళ్తుంది,” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు అగ్ర నిర్మాత అల్లు…
Read MoreRam Gopal Varma | 36 ఏళ్ల తర్వాత ‘శివ’పై వర్మ కొత్త విశ్లేషణ
రీ–రిలీజ్ కోసం సినిమా చూస్తుండగా కొత్త అర్థం దొరికిందన్న ఆర్జీవీ “శివ ఒక మనిషి కాదు, భయానికి లొంగని ఒక సిద్ధాంతం” ఆత్మగౌరవం విషయంలో శివ ఆలోచనల్లో గాంధేయత ఉంది “శివ మౌనం అతిపెద్ద ఆయుధం” – వర్మ “అందుకే 36 ఏళ్లైనా శివను ఎవరూ మర్చిపోలేదు” తెలుగు సినిమా చరిత్రలో ఒక యుగాన్ని మార్చిన చిత్రం ‘శివ’. ఆ సినిమా విడుదలై 36 ఏళ్లు పూర్తవుతున్న వేళ, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ‘శివ’పై కొత్తగా ఆలోచించిన విషయాలను పంచుకున్నారు. నాగార్జున కెరీర్‌కు మలుపు తిప్పిన ఈ సినిమా, వర్మకు దర్శకుడిగా గుర్తింపును తెచ్చింది. ఇప్పుడు రీ–రిలీజ్ సందర్భంగా మళ్లీ చూసినప్పుడు, 26 ఏళ్ల వయసులో తాను ఊహించి సృష్టించిన శివ పాత్రను, 62 ఏళ్ల వయసులో పూర్తిగా అర్థం చేసుకున్నానని వర్మ చెప్పారు.…
Read MoreKeerthi Suresh : ‘ఉప్పు కర్పూరం’ రివ్యూ – చిన్న ఊరి చిన్న కథ, కానీ ఎమోషన్ తక్కువ
‘ఉప్పు కర్పూరం’ రివ్యూ – చిన్న ఊరి చిన్న కథ, కానీ ఎమోషన్ తక్కువ కీర్తి సురేశ్ మరియు సుహాస్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ‘ఉప్పు కర్పూరం‘. ఐవి శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 28 రోజులకే పూర్తి అయ్యింది. థియేటర్లకు రావకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అయింది. ప్రస్తుతం స్ట్రీమింగ్‌లో ఉన్న ఈ సినిమా కథపై ఓ నజర్ వేయుదాం. కథా సారాంశం: 1992 నాటి ‘చిట్టి జయపురం’ అనే గ్రామంలో ఈ కథ జరుగుతుంది. గ్రామ పెద్ద సుబ్బరాజు (శుభలేఖ సుధాకర్) మృతి చెందుతాడు. అతని కుమార్తె అపూర్వ (కీర్తి సురేశ్) అనుకోని పరిస్థితుల్లో గ్రామ పెద్దగా మారుతుంది. అయితే, స్థానిక నాయకులు భీమయ్య (బాబూ మోహన్), మధుబాబు (శత్రు) అప్పటికే ఆ స్థానం కోసం పరస్పరం…
Read MoreKamal Hassan : కమల్ హాసన్‌కి బెంగళూరు కోర్టు నోటీసులు – వ్యాఖ్యలపై మధ్యంతర ఆదేశాలు
వ్యాఖ్యలపై మధ్యంతర ఆదేశాలు ప్రముఖ నటుడు కమల్ హాసన్కి బెంగళూరులోని సివిల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కన్నడ భాష లేదా సంస్కృతిని కించపరిచేలా ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని ఆయనను ఆదేశిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదంతా కమల్ హాసన్ చేసిన ఓ వివాదాస్పద వ్యాఖ్యపై మొదలైంది. తన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా “కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాటలు కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకతను రేపాయి. పలు కన్నడ సంఘాలు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. క్షమాపణ చెప్పాలని పలుమార్లు కోరినప్పటికీ కమల్ నిరాకరించడంతో వివాదం తీవ్రంగా మారింది. దాంతో పాటు, కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ సినిమా విడుదల కూడా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో, కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు…
Read More