OG | పవన్ కల్యాణ్ ఓజీ చిత్రంలో నటుడు నారా రోహిత్ కాబోయే భార్య శిరీష

OG

 పవన్ కల్యాణ్ ఓజీ చిత్రంలో నటుడు నారా రోహిత్ కాబోయే భార్య శిరీష పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘ఓజీ’ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.  ఇటీవల ఈ చిత్రంలో నటుడు నారా రోహిత్ కాబోయే భార్య శిరీష నటిస్తున్నారనే వార్తలు వినిపించగా, ఇప్పుడు ఈ విషయం నేరుగా నారా రోహిత్ ధృవీకరించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్‌లతో కలిసి నటించిన ‘భైరవం’ సినిమా ప్రమోషన్లలో నారా రోహిత్ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోహిత్, సాయి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, “‘ఓజీ’లో నా కాబోయే భార్య శిరీష ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది” అని తెలిపారు. ఈ ప్రకటనతో శిరీష…

Read More

Ram Charan | రామ్ చరణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా

ramcharan trivikram combo

రామ్ చరణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రాబోతోందన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ సంచలనమైన అప్‌డేట్ సినీ వర్గాల్లో కూడా విశేష ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది. ఈ సినిమా పూర్తైన వెంటనే, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోందని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో ఒక సినిమా అధికారికంగా ఇప్పటికే ప్రకటించబడింది. ఈ ప్రాజెక్ట్‌తో పాటు త్రివిక్రమ్ సినిమా కూడా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయని సమాచారం.…

Read More

Teja Sajja | విజువల్ వండ‌ర్‌గా తేజా సజ్జా “మిరాయ్” టీజ‌ర్

mirai

విజువల్ వండ‌ర్‌గా తేజా సజ్జా “మిరాయ్” టీజ‌ర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా పాన్ ఇండియా సినిమా ‘మిరాయ్’. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. “జరగబోయేది మారణహోమం… శిధిలం కాబోతుంది అశోకుడి ఆశయం” అంటూ ప్రారంభమైన ఈ టీజర్, మొదటి క్షణం నుంచే ఆసక్తిని రేపుతోంది. “నాలుగు పుస్తకాలు, వంద ప్రశ్నలు, ఒక కర్ర” అంటూ తేజ సజ్జ పలికిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మంచుకొండల్లో ఒక భారీ పక్షి నుంచి తప్పించుకునే సన్నివేశాలు, రైలుపై పరుగులు తీసే యాక్షన్ శాట్లు థ్రిల్ కలిగిస్తున్నాయి. టీజర్‌లో చూపిన విజువల్ ఎఫెక్ట్స్ సినిమా స్థాయిని భారీగా రెట్టింపు చేశాయి. మొత్తంగా ఈ టీజర్‌ ఊహించని విధంగా, మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా రూపొందించబడిందని చెప్పవచ్చు. పాన్…

Read More

Archana | ఆయనే నా పేరును ‘అర్చన’ అని మార్చారు : నటి అర్చన

archana

ఆయనే నా పేరును ‘అర్చన’ అని మార్చారు : నటి అర్చన ‘అర్చన’ అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చే సినిమా ‘నిరీక్షణ’. బాలూ మహేంద్ర దర్శకత్వంలో 1982లో విడుదలైన ఈ చిత్రం కథా, కథనాల పరంగా తెలుగు సినీ ప్రపంచాన్ని ఓ కొత్త దిశగా తీసుకెళ్లింది. ఈ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు పొందిన అర్చన, ఆ తర్వాత ‘లేడీస్ టైలర్’ సినిమాలోనూ తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె రాజేంద్రప్రసాద్‌తో కలిసి నటించిన సినిమా ‘షష్ఠి పూర్తి’ ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్చన మాట్లాడుతూ:“నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న తర్వాతనే నటన వైపు వచ్చాను. మా అమ్మవారి కుటుంబం ఆంధ్రప్రదేశ్‌కి చెందినదే కావడంతో, నాకు తెలుగు బాగా వస్తుంది.…

Read More

Harihara Veeramallu | హరిహర విరమల్లు నుంచి ‘తార తార నా క‌ళ్లు’ సాంగ్ విడుదల

nidhi aggarwal

హరిహర విరమల్లు నుంచి ‘తార తార నా క‌ళ్లు’ సాంగ్ విడుదల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరిహర వీరమల్లు‘ నుంచి మరో పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటివరకు విడుదలైన ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’, ‘అసుర హననం’ పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని హీరోయిన్ నిధి అగర్వాల్ పాటను విడుదల చేశారు. ‘తార తార నా కళ్ళు.. వెన్నెల పూత నా ఒళ్లు’ అంటూ సాగే ఈ పాటకు శ్రీహర్ష లిరిక్స్ అందించగా, లిప్సికా మరియు ఆదిత్య అయ్యంగార్ ఆలపించారు. ఈ పాటలో నిధి అగర్వాల్ తన అందంతో ఆకట్టుకుంది. ఈ సినిమా రెండు పార్టులుగా రూపొందుతోంది. మొదటి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో జూన్ 12న వరల్డ్‌వైడ్‌గా…

Read More

Operation Sindhoor: సినిమాగా ‘ఆపరేషన్ సింధూర్’.. ఫస్ట్ పోస్టర్ రిలీజ్

sindhoor movie poster

సినిమాగా ‘ఆపరేషన్ సింధూర్’.. ఫస్ట్ పోస్టర్ రిలీజ్ జమ్మూ, కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ ఇప్పుడు వెండితెరపైకి రానుంది. పాక్‌ ఆధారిత ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, తొమ్మిది శిబిరాలను బాంబులతో నాశనం చేసిన ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం చూపించిన ధైర్యం, వ్యూహాత్మక దాడుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించారు. నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్, ది కంటెంట్ ఇంజనీర్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు ఉత్తమ్ మహేశ్వరి దర్శకత్వం వహించనున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ ఈ చిత్రంపై ఆసక్తిని పెంచింది. పోస్టర్‌లో ఒక మహిళా సైనికురాలు – రైఫిల్ పట్టుకుని, తన ముద్దు భాగంలో సింధూరం దిద్దుకుంటూ వెనక్కి తిరిగి నిలబడిన తీరు – దేశభక్తిని ప్రతిబింబించేలా ఉంది. బ్యాక్‌డ్రాప్‌లో యుద్ధ…

Read More

Hanshita Reddy : ఇంట్లోనే తల్లి విగ్రహం ఏర్పాటు చేసిన దిల్ రాజు కుమార్తె హన్షిత

dil raju daughter

ఇంట్లోనే తల్లి విగ్రహం ఏర్పాటు చేసిన దిల్ రాజు కుమార్తె హన్షిత టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుమార్తె హన్షిత మదర్స్ డే సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ భావోద్వేగమైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే, హన్షిత తల్లి అనిత గుండెపోటుతో కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. తల్లి ఇకలేను అన్న సంగతి ఎంత కఠినమైనదైనా, ఆమె జ్ఞాపకాలను చిరకాలం సజీవంగా ఉంచేందుకు హన్షిత తన ఇంట్లోనే తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. మదర్స్ డే సందర్భంగా ఆ విగ్రహాన్ని హత్తుకుంటూ తల్లి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరిచింది. ఈ సందర్భంగా హన్షిత తల్లి విగ్రహం ముందు తన కూతురు ఇషితా, తాతమ్మతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ “నాలుగు తరాలు” అని క్యాప్షన్ జత చేసింది. ఆ ఫోటో…

Read More

Pawan Kalyan : ప‌వ‌న్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’పై కీల‌క అప్‌డేట్‌

og

ప‌వ‌న్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’పై కీల‌క అప్‌డేట్‌ పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్‌ మరియు యువ దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ తిరిగి సెట్స్ పైకి వచ్చింది. కొంతకాలంగా షూటింగ్ నిలిచిపోయిన ఈ చిత్రం తాజాగా మళ్లీ ప్రారంభమైందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.  ఈ సందర్భంగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షూటింగ్ స్టార్ట్ అయిన ఫోటోను అభిమానులతో షేర్ చేస్తూ, “మళ్లీ మొదలైంది… ఈసారి ముగిద్దాం” అనే క్యాప్షన్ జత చేశారు. తాజా షెడ్యూల్‌లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారా లేదా అన్నది మాత్రం అధికారికంగా తెలియరాలేదు. అయితే పవన్ ఎప్పుడు సెట్లో చేరతారన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది. అయితే, ‘ఓజీ’ షూటింగ్ రీషార్ట్ అయ్యిందనే వార్తే పవర్ స్టార్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేపిందనడం తప్పు కాదు. ఈ…

Read More

Vishal : కూవాగం వేడుకల్లో నటుడు విశాల్‌కు అస్వస్థత

vishal1

కూవాగం వేడుకల్లో నటుడు విశాల్‌కు అస్వస్థత ప్రముఖ తమిళ నటుడు విశాల్ అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కూవాగం గ్రామంలో జరుగుతున్న ప్రసిద్ధి చెందిన కూత్తాండవర్ ఆలయ చిత్తిరై ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో ఆదివారం రాత్రి ట్రాన్స్‌జెండర్ల కోసం నిర్వహించిన ‘మిస్ కూవాగం 2025’ అందాల పోటీలో పాల్గొన్న విశాల్, కార్యక్రమం మధ్యలో వేదికపై స్పృహ కోల్పోయి కిందపడిపోయారు. ఈ అనూహ్య పరిణామంతో అక్కడ ఉన్నవారు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు, అభిమానులు ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. కొద్దిసేపటికి ఆయన తిరిగి చైతన్యం పొందారు. అనంతరం, మెరుగైన వైద్యం కోసం అక్కడే ఉన్న రాష్ట్ర మాజీ మంత్రి పొన్ముడి సహాయంతో విశాల్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, ఇటీవల విశాల్ ఆరోగ్యంపై కొన్ని…

Read More

Samantha : సమంతకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రామ్ చరణ్ ట్వీట్

subham movie

ఈ నెల 9న విడుదలైన సమంత ‘శుభం’ మూవీ నటి సమంత నిర్మాతగా మారి నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ మే 9న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ, విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రేక్షకుల కొంతమంది కథపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, సినీ వర్గాల నుంచి మాత్రం సమంతకు మద్దతు లభిస్తోంది. ఇటీవల, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా గురించి ఎక్స్ వేదికగా స్పందించారు. సమంతకు అభినందనలు తెలియజేస్తూ ఆయన, “శుభం గురించి కుటుంబాల నుంచి మంచి మాటలు వింటున్నాను. ట్రైలర్ ఎంతో హృద్యంగా ఉంది. ఈ సినిమాను నా కుటుంబంతో కలిసి చూడటానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఇలాంటి వైవిధ్యభరితమైన, ప్రేరణాత్మక చిత్రాలను మనం ప్రోత్సహించాలి. సమంతకు నిర్మాతగా శుభారంభం కావాలని కోరుకుంటున్నాను.…

Read More