Manchu Vishnu : వీరిలో పెద్ద రౌడీ ఎవరు?

mohan babu

రాంగోపాల్ వర్మ,  మోహన్ బాబు ఫొటోను షేర్ చేసిన మంచు విష్ణు  నటుడు మంచు విష్ణు తన ఎక్స్ ఖాతాలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, సీనియర్ నటుడు మోహన్ బాబు ముచ్చటిస్తున్న ఓ ఫొటోను షేర్ చేశారు. ఆసక్తికరంగా, వారి పేర్లను మారుస్తూ ‘‘ఈ ఇద్దరితో సాయంత్రం వైల్డ్‌గా సాగింది. మోహన్‌బాబు వర్మ, మంచు రాంగోపాల్! వీరిలో పెద్ద రౌడీ ఎవరు?” అంటూ ఫ్యాన్స్‌ను ప్రశ్నించారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, రాంగోపాల్ వర్మ ‘రౌడీ’ అనే సినిమాను మోహన్‌బాబు, విష్ణు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించారు. అలాగే, విష్ణును హీరోగా ‘అనుక్షణం’ అనే థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. 2014లో ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడైతే, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో మోహన్‌బాబు కీలక పాత్ర పోషించగా,…

Read More

Priyadarshi : వసూళ్ల పరంగా దూసుకుపోతున్న ‘కోర్ట్’ మూవీ

court movie

రిలీజైన 10 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌కు చేరిన సినిమా ప్రస్తుత సినిమాల ట్రెండ్‌ను పరిశీలిస్తే, పెద్ద తారాగణం లేకపోయినా లేదా భారీ బడ్జెట్‌తో రూపొందించకపోయినా, కథ బలంగా ఉంటే ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరిస్తున్న విషయం స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని నిరూపించే తాజా ఉదాహరణగా నేచురల్ స్టార్ నాని సమర్పణలో, ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన ‘కోర్ట్’ చిత్రం నిలిచింది. ఈ నెల 14న విడుదలైన ‘కోర్ట్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. మొదటి రోజే రూ.8 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, తాజాగా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. మొత్తం పది రోజుల్లోనే రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, దాదాపు రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం అధికారికంగా ఓ…

Read More

Tuk Tuk Movie : ‘టుక్ టుక్’ మూవీ రివ్యూ

tuktuk

వెహికల్ చుట్టూ అల్లుకున్న ఫాంటసీ కథ చిన్న సినిమాలకు కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో కొంతమంది దర్శక, నిర్మాతలు ప్రయోగాత్మకంగా ప్రయత్నిస్తున్నారు. అదే కోవలో రూపొందిన చిత్రం ‘టుక్ టుక్‘. ఫాంటసీ, మ్యాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ కథ ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. కథ: ఓ గ్రామంలో ముగ్గురు యువకులు (హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు) నిరుద్యోగంగా కాలక్షేపం చేస్తుంటారు. ఓ చెడ్డ పని చేయడానికి డబ్బు అవసరమవడంతో, వినాయక చవితి పేరుతో విరాళాలు సేకరించి, ఆ డబ్బుతో కెమెరా కొనాలని నిర్ణయించుకుంటారు. కానీ అనుకోకుండా, వారి ఆటో-స్కూటర్‌కు మాయశక్తులు వస్తాయి. ఇక ఆ వెహికల్‌కు ఆ శక్తులు ఎలా వచ్చాయి? వాటి ప్రభావం ఏమిటి? వీరి జీవితాల్లో వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి? మేఘ…

Read More

Mohan Babu : తండ్రి మోహన్ బాబు బర్త్‌డేపై ఎమోషనల్ అయిన మంచు మనోజ్

manchu mohan babu

తండ్రి మోహన్ బాబు బర్త్‌డేపై ఎమోషనల్ అయిన మంచు మనోజ్ నటుడు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా, ఆయన కుమారుడు మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరిత సందేశం పోస్ట్ చేశారు. తండ్రికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. మనమంతా కలిసి వేడుకలు జరుపుకునే ఈ రోజున, మీ పక్కన ఉండే అవకాశం కోల్పోయాను. మీతో గడిపే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా. లవ్ యూ” అంటూ మనోజ్ భావోద్వేగపూరితంగా రాశారు. దీనికి తోడు, ఒక ఫొటోతో పాటు వీడియోను కూడా జోడించారు. ఇటీవల మంచు కుటుంబంలో వివాదాల కారణంగా మనోజ్, మోహన్ బాబు మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన పెట్టిన ఈ పోస్ట్ ప్రత్యేకంగా చర్చనీయాంశంగా…

Read More

Hunt : ఈ నెల 28 నుంచి ఓటీటీ లోకి మలయాళంలో రూపొందిన ‘హంట్’

hunt movie poster

ఓటీటీ లోకి మలయాళం హారర్ మూవీ ‘హంట్’ మలయాళ దర్శకులు క్రైమ్ థ్రిల్లర్లు, మర్డర్ మిస్టరీలు తెరకెక్కించే విధానం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అందువల్ల ఆ తరహా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇదే నేపథ్యంలో, మరో మలయాళ హారర్ థ్రిల్లర్ ‘హంట్’ ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఆగస్టు 23న థియేటర్లలో విడుదలై, మంచి స్పందన పొందింది. ఇప్పుడు, ఈ నెల 28వ తేదీ నుంచి ‘హంట్’ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. కథ & నటీనటులు :ఈ సినిమాలో భావన ప్రధాన పాత్రలో నటించగా, రెంజీ పణిక్కర్, అజ్మల్ అమీర్, చందూనాథ్, అనూ మోహన్, అదితి రవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కైలాస్ మీనన్ సంగీతం అందించిన ఈ సినిమా మిస్టరీ, హారర్ ఎలిమెంట్స్‌ కలగలిపిన…

Read More

Chiranjeevi : సునీత విలియమ్స్ గొప్ప ధైర్యవంతురాలు, ఆమెకు సాటి మరెవరూ లేరు : చిరంజీవి

sunitha williams

సునీత విలియమ్స్ గొప్ప ధైర్యవంతురాలు, ఆమెకు సాటి మరెవరూ లేరు : చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి సునీతా విలియమ్స్‌పై ప్రశంసలు కురిపించారు. రోదసిలో 9 నెలలు గడిపిన అనంతరం, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సహా నలుగురు వ్యోమగాములు ఈ తెల్లవారుజామున భూమికి చేరుకున్న నేపథ్యంలో, చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌కు స్వాగతం పలుకుతూ, ఈ సంఘటనను చారిత్రక ఘట్టంగా అభివర్ణించిన చిరంజీవి, 8 రోజుల్లో తిరిగి వస్తామన్న వారు 286 రోజుల తర్వాత భూమికి చేరుకున్న విషయాన్ని ప్రస్తావించారు. భూమి చుట్టూ 4,577 సార్లు తిరిగిన ఈ ప్రయాణాన్ని గొప్ప సాహసం అని అభివర్ణించారు. సునీతా విలియమ్స్ ధైర్యసాహసాలకు ఎవ్వరూ సాటి కాదని ప్రశంసించిన ఆయన, ఈ ప్రయాణం ఓ అద్వెంచర్ మూవీని తలపిస్తోందని, నిజమైన బ్లాక్ బస్టర్‌…

Read More

Mahesh Babu Foundation: మ‌హేశ్ బాబు ఔదార్యం.. ఉచితంగా 4,500 హార్ట్ ఆప‌రేష‌న్స్

mahesh babu foundation

మ‌హేశ్ బాబు ఔదార్యం.. ఉచితంగా 4,500 హార్ట్ ఆప‌రేష‌న్స్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తున్న సమాజ సేవ నిజంగా ప్రశంసనీయం. చిన్నారుల గుండె శస్త్రచికిత్సల కోసం ఉచిత సేవలు అందించడం ద్వారా ఆయన ఎంతో మంది ప్రాణాలను రక్షిస్తున్నారు. 4,500 ఆపరేషన్ల మైలురాయిని చేరుకోవడం నిజంగా గొప్ప విషయం. అలాగే, నమ్రతా శిరోద్కర్ చేపట్టిన మదర్స్ మిల్క్ బ్యాంక్, బాలికలకు గర్భాశయ క్యాన్సర్ టీకా కార్యక్రమం కూడా చాలా కీలకం. ఆరోగ్య సేవల్లో వీరి కృషి మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. మహేశ్ బాబు ఫౌండేషన్ ఇలాంటి మంచి కార్యక్రమాలు మరింత విస్తరించాలని కోరుకుందాం! Read : SSMB29 : మొదలైన ఎస్ఎస్ రాజ‌మౌళి, మ‌హేశ్ బాబు కాంబినేషన్ ప్రాజెక్ట్ షురూ

Read More

Tamannaah : జీవితంలో అద్భుతం జరగదు.. మనమే సృష్టించుకోవాలన్న తమన్నా

Tamannaah

జీవితంలో అద్భుతం జరగదు.. మనమే సృష్టించుకోవాలన్న తమన్నా ఇండస్ట్రీలో ఎన్నేళ్లు గడిచినా మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల ఆమె గ్లామర్ డోస్ పెంచడంతో పాటు, స్క్రీన్‌పై మరింత బోల్డ్ అవతార్‌లో కనిపిస్తోంది. ‘లస్ట్ స్టోరీస్’ సిరీస్‌లో బోల్డ్ సీన్స్‌లో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక గత మూడేళ్లుగా విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న తమన్నా, ఇకrelationship ముగిసిందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. “జీవితంలో అద్భుతాన్ని ఎదురుచూడాల్సిన అవసరం లేదు… మనమే సృష్టించుకోవాలి” అంటూ సందేశాన్ని షేర్ చేసింది. అంతేకాదు, ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా, రషా థడానీ, ప్రగ్యా కపూర్‌లతో కలిసి పార్టీ చేసుకున్న ఫోటోలు కూడా పోస్ట్ చేసింది. ఈ పోస్టును చూసిన నెటిజన్లు, తమన్నా…

Read More

Gopalakrishnan : మ‌ల‌యాళ ప్ర‌ముఖ ర‌చ‌యిత మంకొంబు గోపాల‌కృష్ణ‌న్ క‌న్నుమూత‌

Gopalakrishnan

గోపాల‌కృష్ణ‌న్ మృతిపై ‘ఎక్స్’ వేదిక‌గా రాజ‌మౌళి సంతాపం మలయాళ ప్రముఖ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ వార్తతో సినీ పరిశ్రమలో విషాదం అలముకుంది. వివిధ చిత్రసీమలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కూడా ఎక్స్ (ట్విట్టర్‌) వేదికగా గోపాలకృష్ణన్ మృతిపట్ల బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగపూరితంగా స్పందించారు. “మంకొంబు గోపాలకృష్ణన్ సర్ మరణవార్త కలచివేసింది. ఆయన రచనలు, కవిత్వం, సంభాషణలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ‘ఈగ’, ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ మలయాళ వెర్షన్ల కోసం ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం చిరస్మరణీయం. ఆయనకు నా హృదయపూర్వక నివాళులు. ఓం శాంతి” అంటూ రాజమౌళి…

Read More

Chiranjeevi : విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి కొత్త చిత్రం

chiranjeevi

విలేజ్ బ్యాక్ డ్రాప్ ;ప చిరంజీవి కొత్త చిత్రం మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర నిర్మాణం జూన్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే, చాలా కాలం తర్వాత మళ్లీ పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరించనుండడం. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రానికి వినోదం ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందని నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. హీరోయిన్‌గా అదితి రావు హైదరీ నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదనంగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి హిట్ ఆల్బమ్ అందించిన సంగీత దర్శకులు భీమ్స్, రమణ గోగుల ఈ సినిమాకు సంగీతం అందించనున్నారని సమాచారం.…

Read More