వీర ధీర సూరన్ 2 – విక్రమ్ నుంచి మరో ప్రయోగం, కానీ స్పష్టత లేదు! తొలినాళ్ల నుంచి ప్రతీసారి తెరపై భిన్నమైన పాత్రల్లో కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు విక్రమ్. ప్రతి సినిమాను ఒక ప్రయోగంగా తీసుకుని, ప్రేక్షకుల మదిలో కొత్త అనుభూతులు మిగల్చాలనే పట్టుదలతో ముందుకెళ్తారు. ఆ క్రమంలో రూపొందిన మరో చిత్రం ‘వీర ధీర సూరన్ 2’. అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుషారా విజయన్, పృథ్వీ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు ‘అమెజాన్ ప్రైమ్’లో స్ట్రీమింగ్ అవుతోంది. కథలోకి ఒక్కసారి వెళ్దాం. కథలోకి: కాళీ (విక్రమ్) ఓ చిన్న గ్రామంలో కిరాణా షాపు నడుపుతూ కుటుంబంతో శాంతిగా జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య వాణి (దుషారా విజయన్), ఇద్దరు పిల్లలు ఉన్నారు.…
Read MoreCategory: Reviews
Movie Reviews
Kalyan Ram : అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ రివ్యూ
అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ రివ్యూ అర్జున్ సన్నాఫ్ వైజయంతి — కల్యాణ్ రామ్, విజయశాంతి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం తల్లీకొడుకుల మధ్య గాఢమైన ఎమోషన్ల నేపథ్యంలో సాగుతుంది. చాలా కాలం తర్వాత విజయశాంతి ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించడంతో సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే థియేటర్లలో విడుదలైంది. ‘బింబిసార’ తర్వాత సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కల్యాణ్ రామ్‌కు ఇది బ్రేక్ ఇవ్వగలదేమో చూడాలి. కథా సారాంశం: కథ 2007లో విశాఖపట్నంలో మొదలవుతుంది. పోలీస్ కమిషనర్ వైజయంతి (విజయశాంతి) ఓ కఠినమైన, నిజాయితీ గల అధికారిణి. ఆమె భర్త విశ్వనాథ్ (ఆనంద్), తీర రక్షకదళంలో పనిచేస్తుంటాడు. వీరి కుమారుడు అర్జున్ (కల్యాణ్ రామ్), తల్లి కోరిక ప్రకారం ఐపీఎస్ కావాలనుకుంటాడు. శిక్షణ…
Read MoreVaralakshmi Sharath Kumar : ‘శివంగి మూవీ రివ్యూ!
‘శివంగి మూవీ రివ్యూ! వరలక్ష్మి శరత్‌కుమార్, ఆనంది ముఖ్యపాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘సివంగి’ మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. నరేశ్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి భరణి ధరన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ‘సివంగి’ అనే టైటిల్ చూస్తే శక్తివంతమైన పాత్రలతో నిండిన సబ్జెక్ట్ ఉంటుందనిపిస్తుంది. కానీ అసలు కధలోకి వెళితే… కొంతంత నిరాశే మిగులుతుంది. కథ: సత్యభామ (ఆనంది) హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఆమె వివాహం రవీంద్రతో జరుగుతుంది. కొత్తగా ఫ్లాట్‌లో కాపురం మొదలైన క్షణాల్లే, రవీంద్ర ప్రమాదానికి గురవుతాడు. ఆ ప్రమాదం తర్వాత అతడు పూర్తిగా వైకల్యంతో బాధపడుతుంటాడు. అయినా సత్యభామ అతనిని వదిలిపెట్టకుండా సేవ చేస్తూ జీవితం కొనసాగిస్తుంది. వివాహ వార్షికోత్సవం రోజునే, అతనికి అవసరమైన…
Read MoreTamanna : ‘ఓదెలా 2’ – మూవీ రివ్యూ!
‘ఓదెలా 2’ – మూవీ రివ్యూ! ఓదెల 2 – రెడీ మేడ్ సీక్వెల్… కాని కొత్తదనం లేదు! ఈ రోజుల్లో ప్రేక్షకులను ఆకట్టుకునే కొత్త కథ రాయడం చాలా కష్టమైన పని. అందుకే చాలామంది దర్శకులు ఇప్పటికే విజయాన్ని సాధించిన సినిమాలకే సీక్వెల్‌లు తీసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే కొన్ని సినిమాలు సీక్వెల్ రూపంలో విజయం సాధిస్తే, మరికొన్నిటి ప్రయాణం బాక్సాఫీస్ వద్ద అర్ధాంతరంగా ముగుస్తుంది. తాజాగా ఆ లైనప్‌లో చేరిన చిత్రం ‘ఓదెల 2’. ఓటీటీలో మంచి స్పందన పొందిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రానికి ఇది కొనసాగింపు. ఈసారి మాత్రం కథ సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. తమన్నా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న థియేటర్లకు వచ్చింది. కథ విషయంలో… కథ మొదటి భాగానికి నేరుగా కొనసాగింపుగా…
Read MoreTouch Me Not : ‘టచ్ మీ నాట్’ వెబ్ సిరీస్ రివ్యూ!
‘టచ్ మీ నాట్’ వెబ్ సిరీస్ రివ్యూ! జియో సినెమా-హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ పైకి మరో ఆసక్తికరమైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ‘టచ్ మీ నాట్’ స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. గతంలో కొన్ని సినిమాలు తెరకెక్కించిన రమణతేజ ఈ సిరీస్‌కు దర్శకుడిగా వ్యవహరించారు. నవదీప్, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్‌సిరీస్ 6 ఎపిసోడ్స్ రూపంలో 7 భాషల్లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కొరియన్ సిరీస్ ‘He is Psychometric’ ఆధారంగా తెరకెక్కించబడింది. కథా సారాంశం: 2009, హైదరాబాద్: దీపావళి సంబరాలు ఉత్సాహంగా జరుగుతున్న సమయంలో ‘మారుతి అపార్ట్‌మెంట్’లో నాలుగు మహిళలను దారుణంగా హత్య చేసిన దుండగుడు ఆపై గ్యాస్ లీక్ చేసి అక్కడి నుంచి పరారవుతాడు. ఈ ప్రమాదంలో రాఘవ్ (నవదీప్) తన తల్లిని, రిషి (దీక్షిత్…
Read MoreRabinhood Movie Review : ‘రాబిన్ హుడ్’ రివ్యూ
‘రాబిన్ హుడ్’ రివ్యూ వెంకీ కుడుముల – నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భీష్మ’ హిట్ తర్వాత, ‘రాబిన్ హుడ్’పై అంచనాలు పెరిగాయి. అయితే, ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా? కథ:అనాథగా పెరిగిన రామ్ (నితిన్) అనాథాశ్రమాలకు సాయం చేసేందుకు అక్రమంగా సంపాదించిన డబ్బును దొంగిలిస్తూ ‘రాబిన్ హుడ్’గా మారతాడు. కానీ, అతని కోసం హోమ్ మినిస్టర్ స్పెషల్ ఆఫీసర్ విక్టర్ (షైన్ టామ్ చాకో)ను రంగంలోకి దింపుతాడు. ఇదే సమయంలో, ఓ ఊహించని కారణంతో నీరా (శ్రీలీల) భారతదేశానికి వస్తుంది. ఆమెకు రాబిన్ హుడ్ ఎలా కలిసి వస్తాడు? అసలు కథ ఏంటి? అనేది మిగతా స్టోరీ. ప్లస్ పాయింట్స్: నితిన్ హ్యాండ్సమ్ లుక్, శ్రీలీల ఎనర్జిటిక్ ప్రెజెన్స్ కొంతవరకు పని చేసిన వెన్నెల కిశోర్ కామెడీ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి మైనస్ పాయింట్స్:…
Read MoreMad Square : ‘మ్యాడ్ స్క్వేర్’ రివ్యూ
మ్యాడ్ స్క్వేర్’ రివ్యూ ‘మ్యాడ్’ హిట్‌తో వచ్చిన సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ యూత్‌కి కావాల్సిన వినోదం అందించిందా? కథ:లడ్డూ (విష్ణు) పెళ్లికి ప్లాన్ చేస్తే, పెళ్లికూతురు పారిపోతుంది. స్నేహితులతో గోవా వెళ్లిన అతనికి ఓ విలువైన లాకెట్ దొరుకుతుంది. దాన్ని వెతుక్కుంటూ గ్యాంగ్ మెస్‌లో పడుతుంది. ఈ కన్‌ఫ్యూజన్ ఎలాంటి ఫన్ క్రియేట్ చేసిందనేది కథ. ప్లస్: కామెడీ బాగా పండింది సునీల్, సత్యం రాజేష్ రోల్స్ ఆకట్టుకున్నాయి సెకండాఫ్‌లో వినోదం ఎక్కువ మైనస్: కాలేజ్ హంగామా మిస్సింగ్ హీరోయిన్స్ లేకపోవడం డౌన్‌సైడ్ కొన్ని సీన్స్ బోరింగ్‌గా అనిపించవచ్చు వర్డిక్ట్:లాజిక్ పట్టించుకోకుండా హిలేరియస్ ఫన్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లకు బాగుంటుంది. వీకెండ్ టైమ్‌పాస్‌కి ఓకే.
Read MoreTuk Tuk Movie : ‘టుక్ టుక్’ మూవీ రివ్యూ
వెహికల్ చుట్టూ అల్లుకున్న ఫాంటసీ కథ చిన్న సినిమాలకు కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో కొంతమంది దర్శక, నిర్మాతలు ప్రయోగాత్మకంగా ప్రయత్నిస్తున్నారు. అదే కోవలో రూపొందిన చిత్రం ‘టుక్ టుక్‘. ఫాంటసీ, మ్యాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ కథ ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. కథ: ఓ గ్రామంలో ముగ్గురు యువకులు (హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు) నిరుద్యోగంగా కాలక్షేపం చేస్తుంటారు. ఓ చెడ్డ పని చేయడానికి డబ్బు అవసరమవడంతో, వినాయక చవితి పేరుతో విరాళాలు సేకరించి, ఆ డబ్బుతో కెమెరా కొనాలని నిర్ణయించుకుంటారు. కానీ అనుకోకుండా, వారి ఆటో-స్కూటర్‌కు మాయశక్తులు వస్తాయి. ఇక ఆ వెహికల్‌కు ఆ శక్తులు ఎలా వచ్చాయి? వాటి ప్రభావం ఏమిటి? వీరి జీవితాల్లో వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి? మేఘ…
Read MoreRamam Raghavam : “రామం రాఘవం” మూవీ రివ్యూ!
‘రామం రాఘవం’ – తండ్రీ కొడుకుల మధ్య సమకాలీన కథ! కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ధన్ రాజ్, నిర్మాతగా మారిన అనంతరం ‘రామం రాఘవం‘ సినిమాతో దర్శకుడిగా మారాడు. సముద్రఖని, ధన్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలై, ఇప్పుడు ‘ఈటీవీ విన్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. కథ: తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు – నిజాయితీ vs ప్రాపంచికత రామం (సముద్రఖని) ఒక రిజిస్ట్రార్ ఆఫీసర్, నిజాయితీతో జీవించే వ్యక్తి. భార్య కమల (ప్రమోదిని), కొడుకు రాఘవ (ధన్ రాజ్) – ఇదే అతని చిన్న కుటుంబం. అయితే రాఘవ చదువుకు దూరమై, పనిలో స్థిరపడలేక, తప్పుదారుల్లోకి వెళ్లడం రామానికి బాధ కలిగించే అంశం. రాఘవ ఏ పని చేసినా, అడ్డదారులు వెతికే అలవాటు. తండ్రి ఇచ్చిన 5…
Read MorePriyadarshi : ‘కోర్ట్’ – మూవీ రివ్యూ
హీరో నాని సొంత బ్యానర్ నుంచి వచ్చిన చిత్రం ‘కోర్ట్’. ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించిన కోర్ట్ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహించాడు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ, ఈ సినిమాపై తనకు ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. అంతేగాక, “ఈ సినిమా లేకుంటే నా ‘హిట్ 3’ చూడొద్దు” అంటూ అందరి దృష్టిని ఈ సినిమాపై మళ్లించాడు. మరి, నిజంగానే ఈ చిత్రం ఆ స్థాయిలో ఉందా? చూద్దాం. కథ: 2013, విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ ఇది. భర్తను కోల్పోయిన సీతారత్నం (రోహిణి) తన పిల్లలను ఎంతో జాగ్రత్తగా పెంచుతుంది. ఆమె కూతురు జాబిలి (శ్రీదేవి), ఇంటర్ చదువుతున్న చందూ (హర్ష్ రోషన్)ను తొలిసారిగా ఆటపట్టించేందుకు ప్రయత్నించి, ప్రేమలో పడుతుంది. చందూ ఓ సామాన్య కుటుంబానికి చెందిన యువకుడు.…
Read More