పాకిస్థాన్ నటుడికి మద్దతు పలికిన ప్రకాశ్ రాజ్` సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన సినిమాను భారత్‌లో నిషేధించిన అంశంపై ఆయన విభిన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల కశ్మీర్లో చోటుచేసుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న వేళ, ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం, పాకిస్థాన్‌పై పలు ఆంక్షలు విధిస్తూ, ఆ దేశ నటులు పాల్గొన్న చిత్రాలను భారత్‌లో విడుదల చేయకుండా నిషేధించింది. ఈ పరిణామాల్లో భాగంగా, ఫవాద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘అబిర్ గులాల్’ అనే చిత్రం కూడా…
Read More