‘క్వాంటమ్ ఏఐ గ్లోబల్’తో కలిసి దిల్ రాజు ఏఐ స్టూడియో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తమ అధికారిక ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో మంగళవారం సాయంత్రం “బోల్డ్… బిగ్… బియాండ్ ఇమాజినేషన్” అంటూ ఒక ఆసక్తికరమైన పోస్టును షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ హింట్‌కి తగ్గట్టే, ఈరోజు ఉదయం 11:08కి సంస్థ నుంచి ఒక కీలక ప్రకటన వెలువడింది. ప్రఖ్యాత ఏఐ బేస్డ్ టెక్నాలజీ కంపెనీ క్వాంటమ్ ఏఐ గ్లోబల్తో కలిసి, ఒక ఆధునిక ఏఐ స్టూడియోను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. వినోద పరిశ్రమ కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేసిన అత్యాధునిక ఏఐ టూల్స్‌ను అభివృద్ధి చేయడమే ఈ కొత్త సంస్థ లక్ష్యమని తెలిపారు. ఈ స్టూడియో పేరుతో పాటు మరిన్ని వివరాలను మే 4న అధికారికంగా ప్రకటించనున్నట్టు…
Read MoreTag: Dil Raju
Dil Raju : వ్యాపారాలు చేస్తున్న వారికి తనిఖీలు సహజం
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో నాలుగు రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడులపై నిర్మాత దిల్ రాజు శనివారం మీడియాతో మాట్లాడారు. వ్యాపారం చేస్తున్నప్పుడు ఐటీ దాడులు సర్వసాధారణమని వివరించారు. తనతో పాటు ఇతర సినీ, వ్యాపార ప్రముఖులపై కూడా సోదాలు జరిగాయని దిల్ రాజు గుర్తు చేశారు. 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు తన కంపెనీలపై దాడులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. నిత్యం ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తుందన్నారు. తన కంపెనీల అకౌంట్ బుక్స్ చూసి ఐటీ అధికారులు ఆశ్చర్యపోయారని, అన్ని అకౌంట్లు స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. అధికారులు వచ్చేసరికి మొత్తం రూ.కోటి లోపే ఉందన్నారు. అతని ఇళ్లు, ఆఫీసుల్లో రూ.20 లక్షల నగదు ఉంది. ఐటీ దాడులు జరుగుతున్నప్పుడు ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రాకూడదని…
Read MoreGame Changer: జనవరి 4న రాజమండ్రిలో ‘గేమ్ చేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ చిత్రం జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రీసెంట్ గా అమెరికాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ కావడంతో… ఏపీలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈరోజు నిర్మాత దిల్ రాజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశమై ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీల గురించి చర్చించారు. పవన్ సౌకర్యాన్ని బట్టి జనవరి 4 లేదా 5 తేదీల్లో ఈ వేడుకను నిర్వహిస్తామని దిల్ రాజు ఇప్పటికే తెలిపాడు. ఈరోజు పవన్‌తో మాట్లాడిన తర్వాత ఈవెంట్‌కు జనవరి 4 తేదీని ఖరారు చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో భారీ…
Read MorePawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు భేటీ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమావేశం అయ్యారు. సోమవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆయన పవన్‌ను కలిశారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చించినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించాలనుకుంటున్నట్లు దిల్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా పవన్ కల్యాణ్ ను కోరినట్లు తెలిపారు. దీనికి పవన్ ఓకే చెప్పినట్లు సమాచారం. దిల్ రాజు, పవన్ మధ్య జరిగిన భేటీకి గాను గేమ్ ఛేంజర్ నిర్మాణ సంస్థ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. కాగా, గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.…
Read Moreసినిమా పరిశ్రమకు అన్నివిధాలుగా అండగా ఉంటా : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వి. వెంకట రమణ రెడ్డి @ దిల్ రాజు నేడు ఉదయం పదవీ భాద్యతలు స్వీకరించారు. మాసాబ్ ట్యాంక్ లోని ఎఫ్.డీ.సి కార్యాలయంలో నేడు ఉదయం వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పదవీ భాద్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యక్రమానికి హాజరై దిల్ రాజ్ ను అభినందించారు. -సినిమా పరిశ్రమకు అన్నివిధాలుగా అండగా ఉంటా – దిల్ రాజ్ పదవి ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వి. వెంకట రమణ రెడ్డి @ దిల్ రాజు నేడు ఉదయం పదవీ భాద్యతలు స్వీకరించారు. మాసాబ్ ట్యాంక్ లోని ఎఫ్.డీ.సి కార్యాలయంలో నేడు ఉదయం వేదపండితుల మంత్రోచ్చారణల…
Read MoreDil Raju : రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పదవీ భాద్యతలు స్వీకరించిన దిల్ రాజ్
రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వి. వెంకట రమణ రెడ్డి @ దిల్ రాజు నేడు ఉదయం పదవీ భాద్యతలు స్వీకరించారు. మాసాబ్ ట్యాంక్ లోని ఎఫ్.డీ.సి కార్యాలయంలో నేడు ఉదయం వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పదవీ భాద్యతలు చేపట్టారు. -రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పదవీ భాద్యతలు స్వీకరించిన దిల్ రాజ్ హైదరాబాద్, డిసెంబర్ 18 : రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వి. వెంకట రమణ రెడ్డి @ దిల్ రాజు నేడు ఉదయం పదవీ భాద్యతలు స్వీకరించారు. మాసాబ్ ట్యాంక్ లోని ఎఫ్.డీ.సి కార్యాలయంలో నేడు ఉదయం వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పదవీ భాద్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమీషనర్ డా. హరీష్ దిల్…
Read More