keerthy-suresh | వివాహానికి పిలవలేకపోయానని జగపతిబాబుకు కీర్తి సురేశ్ క్షమాపణలు

keerthi suresh

ప్రముఖ నటి కీర్తి సురేశ్, సీనియర్ నటుడు జగపతిబాబుకు క్షమాపణలు తెలిపారు. తన వివాహానికి ఆయనను ఆహ్వానించలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో **‘జయమ్ము నిశ్చయమ్మురా’**లో ఇటీవల కీర్తి సురేశ్ పాల్గొని తన వివాహానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను, ఆంథోనీ తటిల్ దాదాపు పదిహేనేళ్లుగా ప్రేమలో ఉన్నామని ఆమె చెప్పారు. ఇరువురు కుటుంబాల అంగీకారంతోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని వివరించారు. తటిల్ ఆరేళ్లపాటు ఖతార్‌లో ఉన్నారని, ఆయన తిరిగి వచ్చిన తర్వాతే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. సుమారు నాలుగేళ్ల క్రితం ఈ విషయం ఇంట్లో చెప్పగా, తన తండ్రి వెంటనే అంగీకరించారని చెప్పారు. అయితే, తన కుటుంబ సభ్యులకు చెప్పే ముందు ఈ విషయం జగపతిబాబుతో పంచుకున్నానని కీర్తి గుర్తుచేశారు. చిత్ర పరిశ్రమలో…

Read More

Keerthy Suresh : సమంత వల్లే తనకు ఈ సినిమాలో ఛాన్స్ వచ్చిందన్న కీర్తి

keerthy suresh

సౌత్ ఇండియన్ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘బేబీ జాన్‌’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ‘బేబీ జాన్’ తమిళ చిత్రం ‘తేరి’కి రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమాలో అవకాశం రావడం గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ… సమంత వల్లే ఈ సినిమాలో అవకాశం వచ్చింది.  ‘తేరి’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించినప్పుడు సమంత తన పేరును సూచించినట్లు కీర్తి సురేష్ వెల్లడించారు. తమిళంలో సమంత పోషించిన పాత్రను హిందీలో పోషించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాకు సమంత తన పేరు సూచించినప్పుడు భయపడ్డానని… అయితే సమంత తనకు చాలా సపోర్ట్ చేసిందని చెప్పింది. సమంత ఇచ్చిన ధైర్యంతోనే సినిమా పూర్తి చేశానని చెప్పింది. ‘బేబీ జాన్’ చిత్రం ఈ నెల 25న విడుదలైంది.…

Read More