Vijay Deverakonda: ఆ వివాదంపై క్లారిటీ.. ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిన‌ విజ‌య్ దేవ‌ర‌కొండ

vijay devarakonda

ఆ వివాదంపై క్లారిటీ.. ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిన‌ విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవ‌ల జరిగిన ‘రెట్రో’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. పాకిస్తాన్ పరిణామాలపై స్పందిస్తూ, “ట్రైబల్స్‌లా కొట్టుకోవడం ఏంటి?” అన్న ఆయన వ్యాఖ్యలు ఆదివాసీ సంఘాల ఆగ్రహానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలతో గిరిజనుల మనోభావాలను దెబ్బతీశారని, అవమానంగా ఉందని ట్రైబల్ జేఏసీ నాయకులు తీవ్రంగా స్పందించారు. గిరిజనుల చరిత్ర, సంస్కృతిని అవమానించేలా వ్యాఖ్యానించడం మానవ విలువలకు విరుద్ధమని వారు అభిప్రాయపడ్డారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ ట్రైబల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు న్యాయవాది కిషన్‌రాజ్ చౌహాన్, ఇతర ప్రతినిధులతో కలిసి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. వివాదం తీవ్రతను గమనించిన విజయ్ దేవరకొండ తాజాగా మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల…

Read More