పాలిటిక్స్ అంటే తనకు ఆసక్తి లేదన్న హీరో అజిత్ కుమార్ తమిళ సినీ నటుడు అజిత్ కుమార్ రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 33 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంలో, రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్న సినీ నటీనటులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, తనకు మాత్రం రాజకీయాల్లో ఏమాత్రం ఆసక్తి లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వస్తూ ప్రజల్లో మార్పు తీసుకురావాలని ఆశించే ప్రతి ఒక్కరికీ విజయం కలగాలని కోరుకుంటానని తెలిపారు. ఈ సందర్భంలో తన సన్నిహితుడు, నటుడు దళపతి విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి రావడాన్ని ప్రస్తావిస్తూ, అది ఒక సాహసోపేతమైన నిర్ణయం అని ప్రశంసించారు. ఇండియా వంటి 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో వేర్వేరు మతాలు, భాషలు, జాతులు కలిగిన ప్రజలు పరస్పర…
Read More