నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్ విడుదల యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు‘కి సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘వకీల్ సాబ్’ ఫేం శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా జూలై 4న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో పాటు, పవర్ఫుల్ యాక్షన్ సీన్లను చూపిస్తూ సినిమాపై భారీ అంచనాలను ఏర్పరిచింది. కథ మొత్తం అన్నాచెల్లెలు మధ్య ఉన్న బంధాన్ని ఆధారంగా చేసుకున్నట్టు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. తన అక్క చేత ‘తమ్ముడు’ అని పిలిపించుకోవాలన్న చిన్న కోరిక కోసం ఏ మేరకైనా పోరాటానికి సిద్ధపడే యువకుడి పాత్రలో నితిన్ శక్తివంతమైన అభినయాన్ని కనబర్చారు. భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు యాక్షన్‌కు కూడా సముచిత స్థానం ఇచ్చినట్టు ట్రైలర్లో స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో…
Read More