ఈ నెల 9న విడుదలైన సమంత ‘శుభం’ మూవీ నటి సమంత నిర్మాతగా మారి నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ మే 9న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ, విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రేక్షకుల కొంతమంది కథపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, సినీ వర్గాల నుంచి మాత్రం సమంతకు మద్దతు లభిస్తోంది. ఇటీవల, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా గురించి ఎక్స్ వేదికగా స్పందించారు. సమంతకు అభినందనలు తెలియజేస్తూ ఆయన, “శుభం గురించి కుటుంబాల నుంచి మంచి మాటలు వింటున్నాను. ట్రైలర్ ఎంతో హృద్యంగా ఉంది. ఈ సినిమాను నా కుటుంబంతో కలిసి చూడటానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఇలాంటి వైవిధ్యభరితమైన, ప్రేరణాత్మక చిత్రాలను మనం ప్రోత్సహించాలి. సమంతకు నిర్మాతగా శుభారంభం కావాలని కోరుకుంటున్నాను.…
Read More