Hit 3 | 4 రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 101కోట్ల‌ పైగా కలెక్ష‌న్స్‌ సాధించిన హిట్ 3

4 రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 101కోట్ల‌ పైగా కలెక్ష‌న్స్‌ సాధించిన హిట్ 3 నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘హిట్ 3’ (హిట్: ది థర్డ్ కేస్), హిట్ సిరీస్‌లో మూడో భాగంగా శైలేశ్ కొలను దర్శకత్వంలో రూపొందింది. మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. విడుదల రోజునే ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని, చిత్రబృందం ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా అధికారికంగా ప్రకటించింది. “సర్కార్ సెంచరీ – 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 101 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు!” అంటూ ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో నానికి జోడీగా…

Read More

Nani : ఒళ్లు గగుర్పొడిచేలా ‘హిట్-3’ విజువల్స్

nani hit 3

ఒళ్లు గగుర్పొడిచేలా ‘హిట్-3’ విజువల్స్  నాని బర్త్డే సందర్భంగా ‘హిట్‌-3’ టీజర్ ను రిలీజ్ చేసిన మేక‌ర్స్‌ నేచుర‌ల్ స్టార్‌ నాని బర్త్డే సందర్భంగా ఆయ‌న హీరోగా న‌టిస్తున్న కొత్త సినిమా హిట్‌-3 టీజర్ ను మేక‌ర్స్‌ రిలీజ్ చేశారు. నాని స‌ర‌స‌న‌ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ ఈ క్రైమ్ థ్రిల్లర్ మే 1న విడుదల కానుంది. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌లో ఊహించని షాకులు బోలెడిచ్చారు. శ్రీన‌గ‌ర్ నేప‌థ్యంలో ఈ క‌థ ఉంటుంద‌ని టీజ‌ర్ చూస్తే తెలుస్తోంది. అక్క‌డ జ‌రిగే వ‌రుస హ‌త్య‌లు.. పోలీస్ ఆఫీస‌ర్ అర్జున్ స‌ర్కార్ వాటిని ఎలా ఛేదించాడు అనే కోణంలో ఈ సినిమా ఉండ‌నుంది. ఊర మాస్ పోలీస్ గా నాని భయంక‌రంగా ఉన్నాడు. రావు రమేశ్ లాంటి ఒకరిద్దరిని తప్ప ఇత‌ర పాత్ర‌ధారుల‌ను రివీల్ చేయకుండా టీజర్ కట్…

Read More