తిరుమల శ్రీవారి సేవలో పూజా హెగ్డే తిరుమల శ్రీవారిని టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న పూజాకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. తరువాత ఆమె రంగనాయకుల మండపానికి వెళ్లగా, అక్కడ వేదపండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. దర్శనానంతరం టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను ఆమెకు అందజేశారు. Read : Ram Charan : దర్శకుడు బుచ్చిబాబుకు విలువైన బహుమతులు పంపించిన రామ్ చరణ్
Read MoreTag: Pooja hegde
Pooja Hegde : కూలీ సినిమా నుంచి పూజా హెగ్డే ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్
కూలీ సినిమా నుంచి పూజా హెగ్డే ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్ ముద్దుగుమ్మ పూజా హెగ్డేకు టాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గినప్పటికీ… తమిళ్ ఇండస్ట్రీ లో మాత్రం వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. రజనీ కాంత్ మరియు దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కూలీ‘ సినిమాలో ఆమె అవకాశాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ఆమె ఐటెం సాంగ్ చేస్తోంది. పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు కోలీవుడ్ స్టార్ విజయ్‌తో కలిసి ‘నాయగన్’ చిత్రంలో నటిస్తున్నది పూజా హెగ్డే. Read : Shraddha Sreenadh | శ్రద్ధా శ్రీనాధ్ నటించిన అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ “కలియుగమ్ 2064” సెన్సార్ పూర్తి
Read More