పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ గ్రీస్‌లో మిగిలిన రెండు పాటల చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ క్రమంలో సినిమాలో హీరోయిన్లలో ఒకరైన మాళవిక మోహనన్, తన ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాల్లో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రీస్‌లోని అందమైన లొకేషన్లో ‘ది రాజా సాబ్’ పోస్టర్ డిజైన్ ఉన్న డ్రెస్ ధరించి పోజులిచ్చిన ఆమె, ఆ ఫోటోకి “Lights, Camera, Greece!” అనే క్యాప్షన్ ఇచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే — ఒక రోజు ముందే దర్శకుడు మారుతి కూడా ఇలాగే సినిమా పోస్టర్ ప్రింట్ ఉన్న టీ-షర్ట్ ధరించి ఫోటోను పోస్ట్ చేశారు.…
Read More