OTT లోకి వస్తున్న ఎల్2: ఎంపురాన్…. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్2: ఎంపురాన్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. భారీ కలెక్షన్లతో దూసుకెళ్లిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 24 నుంచి జియో సినిమా (JioCinema) లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. గతంలో మోహన్‌లాల్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లూసిఫర్’ కు ఇది సీక్వెల్. ‘ఎల్2: ఎంపురాన్’ మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. Read : L2 Empuraan : ‘ఎల్-2 ఎంపురన్’ మూవీ రివ్యూ
Read MoreTag: prudhviraj sukumaran
L2 Empuraan : ‘ఎల్-2 ఎంపురన్’ మూవీ రివ్యూ
L2 Empuraan : ‘ఎల్-2 ఎంపురన్’ మూవీ రివ్యూ మలయాళ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘లూసిఫర్’ చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘ఎల్2: ఎంపురాన్‘. ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో, ప్రేక్షకుల్లో సినిమా పై ఆసక్తి పెరిగింది. అసలు ఈ కథ ఏమిటి? ఈ సినిమాలోని రాజకీయ నేపథ్యం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? వివరంగా తెలుసుకుందాం. కథ: ‘లూసిఫర్’ ముగిసిన చోటినుంచి ‘ఎల్2: ఎంపురాన్’ ప్రారంభమవుతుంది. పీకే రామదాస్ (సచిన్ ఖేడ్కర్) మరణంతో, అతని పార్టీలో అంతర్గత కలహాలు చెలరేగుతాయి. స్టీఫెన్ వట్టిపల్లి (మోహన్‌లాల్) జతిన్ రామదాస్ (టోవినో థామస్)ను సీఎంగా నిలబెట్టిన తర్వాత అదృశ్యమవుతాడు. అయితే, అధికారంలోకి వచ్చిన జతిన్ అక్రమాలకు పాల్పడుతుండటంతో, పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కి పరిపాలన సాగిస్తాడు. జతిన్ నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చి ‘ఐయూఎఫ్…
Read More