Kantara 1 | 9 రోజుల్లో రూ.509 కోట్లు వసూలు చేసిన ‘కాంతార: చాప్టర్ 1’ 

Kantara 1

కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది.  ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం, విడుదలైన తొలి రోజు నుంచే వసూళ్ల వర్షం కురిపిస్తూ రికార్డులను తిరగరాస్తోంది.  తాజాగా సినిమా యూనిట్ ప్రకటించిన వివరాల ప్రకారం, ‘కాంతార: చాప్టర్ 1’ కేవలం 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.509 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దసరా పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం, అంచనాలకు మించి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.  సినిమా విజయోత్సవంగా, చిత్ర బృందం ఈ భారీ వసూళ్ల వివరాలతో కూడిన కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.  ‘కాంతార’ మొదటి భాగానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ ప్రీక్వెల్, ప్రేక్షకులను తన సౌండ్, విజువల్స్, కథా శైలితో ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా,…

Read More

Ram Gopal Varma | 36 ఏళ్ల తర్వాత ‘శివ’పై వర్మ కొత్త విశ్లేషణ

rgv

రీ–రిలీజ్ కోసం సినిమా చూస్తుండగా కొత్త అర్థం దొరికిందన్న ఆర్జీవీ “శివ ఒక మనిషి కాదు, భయానికి లొంగని ఒక సిద్ధాంతం” ఆత్మగౌరవం విషయంలో శివ ఆలోచనల్లో గాంధేయత ఉంది “శివ మౌనం అతిపెద్ద ఆయుధం” – వర్మ “అందుకే 36 ఏళ్లైనా శివను ఎవరూ మర్చిపోలేదు” తెలుగు సినిమా చరిత్రలో ఒక యుగాన్ని మార్చిన చిత్రం ‘శివ’. ఆ సినిమా విడుదలై 36 ఏళ్లు పూర్తవుతున్న వేళ, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ‘శివ’పై కొత్తగా ఆలోచించిన విషయాలను పంచుకున్నారు. నాగార్జున కెరీర్‌కు మలుపు తిప్పిన ఈ సినిమా, వర్మకు దర్శకుడిగా గుర్తింపును తెచ్చింది. ఇప్పుడు రీ–రిలీజ్ సందర్భంగా మళ్లీ చూసినప్పుడు, 26 ఏళ్ల వయసులో తాను ఊహించి సృష్టించిన శివ పాత్రను, 62 ఏళ్ల వయసులో పూర్తిగా అర్థం చేసుకున్నానని వర్మ చెప్పారు.…

Read More