బన్నీతో దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్న ‘ఏఏ22’ చిత్ర ప్రకటన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించనున్న కొత్త సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్న ‘ఏఏ22’ చిత్ర ప్రకటన వీడియోను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అట్లీ, బన్నీ ప్రాజెక్ట్ వివరాలను వీడియోలో పంచుకుంది. ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు వీడియోలో చూపించారు. అభిమానుల ఊహలకు అందని విధంగా సినిమా ఉండనుందని తెలిపింది. హాలీవుడ్ తరహాలో విజువల్స్ ఉండనున్నాయి. దీనికోసం అట్లీ, అల్లు అర్జున్ లాస్ ఏంజెలెస్‌లోని ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థను సంప్రదించారు. వీఎఫ్ఎక్స్ నిపుణులు కూడా ఇప్పటివరకూ ఇలాంటి స్క్రిప్ట్ చూడలేదని చెప్పడం వీడియోలో ఉంది. బన్నీ స్క్రీన్ టెస్ట్ విజువల్స్ కూడా ఇందులో చూపించారు. “ల్యాండ్‌మార్క్ సినిమాటిక్…
Read More