సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డులు.. జ్ఞాపిక ఆవిష్కరణ!

tgfa awards

గద్దర్ సినిమా అవార్డుల జ్ఞాపిక విడుదల: వేడుకకు భారీ ఏర్పాట్లు! దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో సినిమా అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల విజేతలను ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు, ఈ నెల 14న హైటెక్స్ వేదికగా అవార్డుల ప్రధానోత్సవ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం తాజాగా గద్దర్ అవార్డుల జ్ఞాపికను విడుదల చేసింది. జ్ఞాపిక రూపకల్పన.. గద్దర్ డప్పుకు ప్రాధాన్యత విడుదలైన జ్ఞాపిక గద్దర్ వ్యక్తిత్వాన్ని, ఆయన కళను ప్రతిబింబించేలా ఉంది. చేతికి రీల్ చుట్టుకున్నట్లుగా ఉండి, పైన చేతిలో డప్పు పట్టుకున్నట్లుగా దీన్ని రూపొందించారు. ఆ డప్పు మీద తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ముద్రించారు. గద్దర్ గుర్తింపుగా, ప్రజా కళా రూపానికి ప్రతీకగా డప్పును ఈ జ్ఞాపికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.…

Read More

Bunny Vass | సింగిల్ స్క్రీన్ థియేటర్ల భవిష్యత్తుపై తీవ్రమైన హెచ్చరిక! బన్నీ వాస్ ట్వీట్ సంచలనం

bunny vas

ఐదేళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూతపడే ప్రమాదం – బన్నీ వాస్ గట్టి హెచ్చరిక ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ చేసిన తాజా ట్వీట్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో భారీ చర్చకు దారి తీసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు సినిమా రంగం ఎదుర్కొంటున్న వ్యాపార సంక్షోభాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. “ఇలాగే కొనసాగితే, రాబోయే ఐదేళ్లలో సుమారు 90 శాతం సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడే ప్రమాదం ఉంది,” అంటూ ఆయన తీవ్ర హెచ్చరిక చేశారు. ఈ సమస్య కేవలం ఎగ్జిబిటర్లు లేదా నిర్మాతల ఆర్థిక ఇబ్బందులకు పరిమితం కాకుండా, వ్యవస్థాపక మార్పులు అవసరమని ఆయన అన్నారు. “శాతం కాదు… వ్యవస్థ మార్చుకోవాలి,” అంటూ తన ట్వీట్‌లో బన్నీ వాస్ పేర్కొన్నారు. ప్రస్తుత వ్యాపార పద్ధతులు పునర్విమర్శించకపోతే, సింగిల్ స్క్రీన్ థియేటర్ల భవిష్యత్తు సారంగా ఉందని ఆయన…

Read More