‘మహారాణి’ సీజన్‌ 4: హ్యూమా ఖురేషి మరోసారి రాజకీయ రంగంలో! | నవంబర్‌ 7 నుంచి సోనీలివ్‌లో

maharani season 4

థ్రిల్లర్‌ జానర్‌కి చెందిన కంటెంట్‌ ఏ భాషలో వచ్చినా ప్రేక్షకుల నుంచి ఎప్పటికప్పుడు మంచి ఆదరణ పొందుతోంది. క్రైమ్‌ థ్రిల్లర్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌, మిస్టరీ థ్రిల్లర్‌లాగే, ఇప్పుడు పొలిటికల్‌ థ్రిల్లర్‌ల కథలు కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ తరహా సిరీస్‌లు ప్రతి సీజన్‌తో తమ స్థాయిని మరింతగా పెంచుకుంటూ వస్తున్నాయి. ఆ వరుసలో నిలిచే వెబ్‌ సిరీస్‌ ‘మహారాణి’. హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌ సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక సాధారణ గృహిణి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే ప్రయాణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందనను రాబట్టాయి. ఇప్పుడు, ఆ విజయాన్ని కొనసాగిస్తూ ‘మహారాణి – సీజన్‌ 4’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో, ముఖ్యమంత్రిగా కొనసాగిన…

Read More

ఈటీవీ విన్ ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’ మూవీ రివ్యూ!

meghalu cheppina prema katha

‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’ – ప్రేమకు మేఘాల ముద్ర ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ డ్రామా ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’. ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కాగా, నరేశ్ అగస్త్య – రాబియా ఖాతూన్ జంటగా నటించారు. విపిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం అక్టోబర్ 9 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది. కథ: వరుణ్‌ (నరేశ్ అగస్త్య) శ్రీమంత కుటుంబంలో పుట్టిన యువకుడు. అతని తండ్రి మహేంద్ర (సుమన్) పెద్ద వ్యాపారవేత్త. తల్లి (ఆమని)తో అతనికి అనుబంధం ఎక్కువ. చిన్ననాటి నుంచే సంగీతం పట్ల ఆకర్షణ కలిగిన వరుణ్‌కి ఆ అభిరుచి నాయనమ్మ (రాధిక) ప్రభావంతో ఏర్పడింది. ఆమె మార్గదర్శకత్వంలో కొంతవరకు సంగీతం నేర్చుకున్న వరుణ్, ఫారిన్‌లో చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించిన తర్వాత కూడా సంగీతాన్ని…

Read More

అమెజాన్ ప్రైమ్ లో ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ

త్రిబాణాధారి-బార్బరక్

‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ రివ్యూ మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రాన్ని విజయ్ పాల్ రెడ్డి నిర్మించారు. సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ సింహా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో విడుదలై, ఇప్పుడు అక్టోబర్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదల సమయంలో దర్శకుడు రిలీజ్ చేసిన వీడియో కారణంగా టైటిల్‌కి విపరీతమైన దృష్టి లభించింది. కథ: శ్యామ్ (సత్యరాజ్) ఒక మానసిక వైద్య నిపుణుడు. ప్రమాదంలో తన కొడుకు–కోడలు మరణించడంతో, మనవరాలు నిధి (14 ఏళ్లు)తో కలిసి హైదరాబాద్‌లో జీవిస్తుంటాడు. ఒకరోజు ఆమెకు ‘బార్బరిక్’ అనే నాటకం చూపిస్తాడు. మూడు బాణాలతో న్యాయాన్ని సాధించే బార్బరికుడు ఆమెను లోతుగా ప్రభావితం చేస్తాడు. ఇక హైదరాబాద్‌లో వాకిలి పద్మ (ఉదయభాను) అనే డాన్ చెలామణి అవుతుంది.…

Read More

Rithu Varma : దేవిక & డానీ వెబ్ సిరీస్ సమీక్ష

rithu varma

కాన్సెప్ట్ ఆసక్తికరమే కానీ కథనం బలహీనమే! రీతూ వర్మ, సూర్య వశిష్ఠ, శివ కందుకూరి ప్రధాన పాత్రల్లో నటించిన ‘దేవిక & డానీ’ వెబ్ సిరీస్, కిశోర్ దర్శకత్వంలో రూపొందింది. జియో సినిమా (JioCinema) లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్‌కి వచ్చింది. మొత్తం 7 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్‌ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ కొంతకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి అంచనాలకు ఈ సిరీస్ ఎంత మేరకు న్యాయం చేసిందో ఇప్పుడు చూద్దాం. కథ సంగతులు: దేవిక (రీతూ వర్మ) ఒక సంప్రదాయబద్ధమైన గ్రామీణ కుటుంబానికి చెందిన యువతి. ఆమె తాతయ్య యోగి నందన్‌కి (రామరాజు) చనిపోయినవారి ఆత్మలను చూడగల ప్రత్యేక శక్తి ఉంటుంది. తల్లి కౌసల్య (రజిత), తండ్రి స్వామినందన్ (శివన్నారాయణ) లతో కలిసి ఒక గ్రామంలో నివసించే దేవిక, ఒక…

Read More

Priyamani : ప్రియమణి ‘గుడ్ వైఫ్’ వెబ్ సిరీస్‌పై భారీ అంచనాలు

priyamani

లాయర్‌గా ప్రియమణి అదరగొట్టేందుకు రెడీ – ‘గుడ్ వైఫ్’ వెబ్ సిరీస్‌పై భారీ అంచనాలు ఓవైపు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే, మరోవైపు వెబ్ సిరీస్‌లతోనూ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం కొనసాగిస్తోంది నటి ప్రియమణి. తెలుగు ఓటీటీలో విడుదలైన ఆమె సినిమా ‘భామ కలాపం‘ మంచి స్పందనను పొందింది. అంతేకాదు, హిందీలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మేన్‘ సిరీస్ ఆమెను దేశవ్యాప్తంగా ఫేమస్ చేసింది. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన మరో ఆసక్తికర వెబ్ సిరీస్ ‘గుడ్ వైఫ్‘ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌ అమెరికాలో విజయవంతమైన ఓ షో ఆధారంగా తెరకెక్కించబడింది. తొలుత తమిళంలో నిర్మించబడిన ఈ సిరీస్, త్వరలో తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి…

Read More

Devayani : ఓటీటీ లో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘నిజార్ కుడై’

నిజార్ కుడై

ఓటీటీ లో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘నిజార్ కుడై’ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ వేదికలపై మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి జానర్లో దేవయాని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘నిజార్ కుడై’. శివ ఆర్ముగం దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 9న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో విజిత్, కన్మణి మనోహర్, రాజ్ కపూర్, ఇళవరసు వంటి ప్రముఖులు ముఖ్య పాత్రలు పోషించారు. థియేటర్లలో విడుదలైన 20 రోజులకే ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ నెల 30వ తేదీ నుంచి ‘ఆహా తమిళ్’లో స్ట్రీమింగ్ కానుందని అధికారిక ప్రకటన వెలువడింది. నరేన్ బాలకుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో, దేవయాని తన నటనతో మంచి మార్కులు కొట్టేసినట్టు విమర్శకుల అభిప్రాయం. కథ పరంగా: నిరంజన్ మరియు లాన్సీ…

Read More

Masood: సమ్మర్లో గజగజలాడించే హారర్ థ్రిల్లర్ మసూద ఓటీటీలో!

masooda

సమ్మర్లో గజగజలాడించే హారర్ థ్రిల్లర్ మసూద ఓటీటీలో! హారర్ థ్రిల్లర్ సినిమాలు చూడాలని అనుకునే వారు చాలామంది, కానీ అదే సమయంలో భయంతో వెనక్కి తగ్గే వాళ్లూ చాలామంది ఉంటారు. అయినా, భయంతో కలసిన థ్రిల్‌కు ఓ ప్రత్యేకమైన కిక్క్ ఉంటుందని నమ్మే ప్రేక్షకులు, గుంపులుగా కలిసి చూసేలా ప్లాన్ చేసుకుంటారు. అలాంటి రకమైన అనుభూతిని అందించిన తెలుగు హారర్ థ్రిల్లర్ ‘మసూద’ ఇప్పుడు మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి ఎంట్రీ ఇచ్చింది. మొదటగా ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా, తాజాగా ‘అమెజాన్ ప్రైమ్’లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. సాధారణంగా హాలీవుడ్ హారర్ సినిమాలే నిజంగా భయపెడతాయనే అభిప్రాయం ఉంది, ముఖ్యంగా అక్కడి టెక్నికల్ స్టాండర్డ్స్ వల్ల. తెలుగు హారర్ సినిమాలు అంతగా భయపడవని భావించే వాళ్ల అభిప్రాయాన్ని చీల్చేసిన సినిమా ‘మసూద’. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ…

Read More

అం అహః – అడవిలో మిస్టరీ, మనసుల్లో వింత

malayalam am aha

  అం అహః – అడవిలో మిస్టరీ, మనసుల్లో వింత మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి వినూత్నమైన కథలతో ఆకట్టుకునే సినిమాలు తరచూ వస్తూనే ఉన్నాయి. వాటిలో తాజా ప్రాముఖ్యమైన చిత్రం ‘అం అహః’. జనవరి 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో మంచి స్పందనను అందుకుంటోంది. తారాగణం: దిలీష్ పోతన్, దేవదర్శినిదర్శకత్వం: థామస్ కె. సెబాస్టియన్సంగీతం: గోపీ సుందర్విడుదల వేదిక: థియేటర్ (ప్రస్తుతంగా ఓటీటీ) సినిమా గురించి: దిలీష్ పోతన్—ఆర్ట్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన, ఈ సినిమాలో కథానాయకుడిగా కనిపించటం విశేషం. దేవదర్శినిలాంటి బలమైన నటితో కలసి ఆయన చేసిన ఈ ప్రయోగాత్మక ప్రయాణం ప్రేక్షకుల్ని కొత్తగా అనిపిస్తోంది. ప్రధానంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సింపుల్ స్టోరిటెల్లింగ్‌కి ఇది మంచి ఉదాహరణగా నిలుస్తోంది. కథ సారాంశం: స్టీఫెన్ (దిలీష్ పోతన్) ఓ రోడ్…

Read More

ప్రణయం 1947 – తక్కువ బడ్జెట్‌లో మనసులను తాకే మలయాళ కథనం

ప్రణయం 1947

ప్రణయం 1947 – తక్కువ బడ్జెట్‌లో మనసులను తాకే మలయాళ కథనం రిలీజ్ డేట్: 2025 ఏప్రిల్ 23నిర్మాత సంస్థ: క్రేయాన్స్ పిక్చర్స్దర్శకుడు: అభిజిత్ అశోకన్సంగీతం: గోవింద్ వసంతకథానాయకులు: జయరాజన్, లీలా శంసన్, దీపక్, అనిమోల్, అలీ చిత్రం గురించి: తక్కువ బడ్జెట్, సాధారణ పాత్రలు, సహజమైన సంభాషణలు – ఇవే మలయాళ సినిమాలకు ప్రత్యేకత. ఇదే కోవలో వస్తున్న తాజా చిత్రం ‘ప్రణయం 1947’ మానవ సంబంధాల్లోని మౌన సందేశాలను నెమ్మదిగా, కానీ ప్రభావవంతంగా మిళితం చేస్తుంది. కథ సంగ్రహం: ఒక మారుమూల గ్రామంలో నివసించే వృద్ధుడు శివన్ (జయరాజన్), గత 12 ఏళ్లుగా భార్యను కోల్పోయిన బాధతో ఒంటరిగా జీవించడాన్ని ఈ సినిమా ప్రారంభిస్తుంది. పొలం పని, వృద్ధాశ్రమం సేవ – ఇవే అతని దినచర్య. అదే ఆశ్రమంలో ఓకాలం టీచర్‌గా పని చేసిన…

Read More

Kushi Ravi : ప్రేక్షకుల ముందుకు రానుంది కొత్త కన్నడ సిరీస్ …‘అయ్యన మనే’’జీ 5’లో క్రైమ్ థ్రిల్లర్!

ayyanamane

ప్రేక్షకుల ముందుకు రానుంది కొత్త కన్నడ సిరీస్ …‘అయ్యన మనే’’జీ 5’లో క్రైమ్ థ్రిల్లర్! ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై క్రైమ్ థ్రిల్లర్‌లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జోనర్‌కి సంబంధించిన సిరీస్‌లు కూడా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయి. అలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మిళితమైతే, ఆ రిస్పాన్స్ మరింత బలంగా కనిపిస్తుంది. అచ్చంగా అలాంటి కాంబినేషన్‌తోనే ప్రేక్షకుల ముందుకు రానుంది కొత్త కన్నడ సిరీస్ — ‘అయ్యన మనే’. ఈ సిరీస్ ఏప్రిల్ 25 నుంచి జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఖుషి రవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌లో, అక్షయ నాయక్, మానసి సుధీర్, విజయ్ శోభరాజ్ వంటి నటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. శృతినాయుడు నిర్మించిన ఈ కథ, 1990ల…

Read More