పైంకిలి : పెద్ద స్క్రీన్ మీద ప్లాప్ కానీ స్మాల్ స్క్రీన్ మీద సూపర్ హిట్

painkili

పెద్ద స్క్రీన్ మీద ప్లాప్ కానీ స్మాల్ స్క్రీన్ మీద సూపర్ హిట్ సాధారణంగా మలయాళ సినిమాలు తక్కువ బడ్జెట్‌తో వస్తుంటాయ్, కానీ వాటిలో ఉండే కథాబలం మాత్రం అమోఘం. చిన్న చిన్న బడ్జెట్లతో తెరకెక్కిన చిత్రాలు, వందల కోట్ల వసూళ్లను గెలుచుకుంటూ సక్సెస్ స్టోరీస్‌గా నిలుస్తుంటాయి. అయితే, కొన్ని సినిమాలు మాత్రం అంచనాలకు భిన్నంగా ఫలితాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాంటి సినిమాల జాబితాలో ‘పైంకిలి’ కూడా చేరిపోయింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు ఏప్రిల్ 11 నుంచి ‘మనోరమా మ్యాక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో అనశ్వర రాజన్, సాజిత్ గోపు ప్రధాన పాత్రల్లో కనిపించారు. శ్రీజిత్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా కథా విషయాల్లో ఓటీటీ ప్రేక్షకులను…

Read More

Mohanlal : OTT లోకి వస్తున్న ఎల్2: ఎంపురాన్… ఎప్పుడు, ఎక్కడంటే…!

l2

OTT లోకి వస్తున్న ఎల్2: ఎంపురాన్…. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్2: ఎంపురాన్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. భారీ కలెక్షన్లతో దూసుకెళ్లిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 24 నుంచి జియో సినిమా (JioCinema) లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. గతంలో మోహన్‌లాల్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లూసిఫర్’ కు ఇది సీక్వెల్. ‘ఎల్2: ఎంపురాన్’ మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. Read : L2 Empuraan : ‘ఎల్‌-2 ఎంపురన్‌’ మూవీ రివ్యూ

Read More

Varalaxmi Sarathkumar: ఓటీటీలోకి వరలక్ష్మీ శరత్ కుమార్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ

varalakshmi sharathkumar

ఓటీటీలోకి వరలక్ష్మీ శరత్ కుమార్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెలుగులో వరలక్ష్మి శరత్ కుమార్ కి ఎంత క్రేజ్ ఉందో, తమిళంలో అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ ఆనంది. రెబల్ రోల్స్‌లో వరలక్ష్మి శరత్ కుమార్ ఎంతగా గుర్తింపు పొందిందో, సాఫ్ట్, ఎమోషనల్ పాత్రల్లో ఆనందికి అంతే గుర్తింపు ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా శివంగి. డెవరాజ్ భరణి ధరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందింది. మర్డర్ కేసు చుట్టూ తిరిగే ఈ కథ, ఈ ఏడాది మార్చి 7న తమిళనాట థియేటర్లలో విడుదలైంది. ఇందులో జాన్ విజయ్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీకి సిద్ధమైంది. ఈ నెల 18వ తేదీ నుంచి ‘ఆహా తమిళ్’ ప్లాట్‌ఫారంలో స్ట్రీమింగ్ కాబోతోంది –…

Read More

Chori 2 | బిడ్డ కోసం దెయ్యంతో పోరాడే తల్లి కధ

చోరీ 2

బిడ్డ కోసం దెయ్యంతో పోరాడే తల్లి కధ హిందీలో రూపొందిన ‘చోరీ’ సినిమా 2021 నవంబరులో థియేటర్లకు విడుదలైంది. అప్పటినుంచి ఈ చిత్రం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. టేకింగ్ పరంగా ప్రశంసలు అందుకున్న ఈ హారర్ థ్రిల్లర్‌ చిత్రంలో నుష్రత్ బరూచా ప్రధాన పాత్రలో మెరిశారు. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా ‘చోరీ 2′గా సీక్వెల్‌ రాబోతోంది. ‘చోరీ 1’లో కథ గర్భవతిగా ఉన్న యువతిని తీయగా మొదలవుతుంది. దెయ్యాల దాడి నుంచి తన బిడ్డను రక్షించేందుకు ఆమె చేసే ప్రయత్నమే కథా హుందాతనం. ఇక ఆమె బిడ్డ పుట్టిన తర్వాత, మళ్లీ అదే భయానక శక్తులు మళ్లీ బెదిరిస్తాయి. అప్పుడు ఆమె బిడ్డను ఎలా కాపాడిందన్నదే ‘చోరీ 2’లో చూపించనున్నారు. విశాల్ ఫురియా దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ ఈ నెల 11న అమెజాన్ ప్రైమ్…

Read More

Officer On Duty : నెట్ ఫ్లిక్స్ లో ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ సినిమా

officer on duty

 ప్రత్యేక ఆకర్షణగా విలన్ గ్యాంగ్ సాధారణంగా ఓ సినిమా చూసిన తర్వాత హీరోయిజం వహించిన పవర్‌ఫుల్ సీన్స్, హీరోయిన్ గ్లామర్ షాట్స్, లేదా నవ్వుల వర్షం కురిపించిన కామెడీ సన్నివేశాలు మనను వెంటాడుతూ ఇంటివరకూ వస్తాయి. ఒకప్పటి విలనిజం, ఆ విలన్స్ చేసే మేనరిజం కూడా జనాల్లో బాగా పాపులర్ అయ్యేది. కానీ, ఇటీవలి కాలంలో స్టైలిష్‌గా కనిపిస్తూ భయపెట్టే విలనిజం మాత్రం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనిపించలేదని చెప్పాలి. అయితే, ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ‘ చూసినవాళ్లంతా ఈ సినిమాలోని విలన్ గ్యాంగ్ గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. కథ ప్రకారం, ఒక యువకుడు పోలీస్ విచారణలో చనిపోతాడు. అయితే, అతను ఒక డ్రగ్స్ మాఫియా బ్యాచ్‌కు చెందినవాడు. దాంతో, ఆ బ్యాచ్ ఆ పోలీస్ ఆఫీసర్‌పై పగ పెంచుకుంటుంది. పోలీస్ ఆఫీసర్ వాళ్లను వేటాడుతుంటే, వాళ్లు అతడిని…

Read More

Hunt : ఈ నెల 28 నుంచి ఓటీటీ లోకి మలయాళంలో రూపొందిన ‘హంట్’

hunt movie poster

ఓటీటీ లోకి మలయాళం హారర్ మూవీ ‘హంట్’ మలయాళ దర్శకులు క్రైమ్ థ్రిల్లర్లు, మర్డర్ మిస్టరీలు తెరకెక్కించే విధానం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అందువల్ల ఆ తరహా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇదే నేపథ్యంలో, మరో మలయాళ హారర్ థ్రిల్లర్ ‘హంట్’ ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఆగస్టు 23న థియేటర్లలో విడుదలై, మంచి స్పందన పొందింది. ఇప్పుడు, ఈ నెల 28వ తేదీ నుంచి ‘హంట్’ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. కథ & నటీనటులు :ఈ సినిమాలో భావన ప్రధాన పాత్రలో నటించగా, రెంజీ పణిక్కర్, అజ్మల్ అమీర్, చందూనాథ్, అనూ మోహన్, అదితి రవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కైలాస్ మీనన్ సంగీతం అందించిన ఈ సినిమా మిస్టరీ, హారర్ ఎలిమెంట్స్‌ కలగలిపిన…

Read More

Ramam Raghavam : “రామం రాఘవం” మూవీ రివ్యూ!

ramam raghavam

‘రామం రాఘవం’ – తండ్రీ కొడుకుల మధ్య సమకాలీన కథ! కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ధన్ రాజ్, నిర్మాతగా మారిన అనంతరం ‘రామం రాఘవం‘ సినిమాతో దర్శకుడిగా మారాడు. సముద్రఖని, ధన్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలై, ఇప్పుడు ‘ఈటీవీ విన్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. కథ: తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు – నిజాయితీ vs ప్రాపంచికత రామం (సముద్రఖని) ఒక రిజిస్ట్రార్ ఆఫీసర్, నిజాయితీతో జీవించే వ్యక్తి. భార్య కమల (ప్రమోదిని), కొడుకు రాఘవ (ధన్ రాజ్) – ఇదే అతని చిన్న కుటుంబం. అయితే రాఘవ చదువుకు దూరమై, పనిలో స్థిరపడలేక, తప్పుదారుల్లోకి వెళ్లడం రామానికి బాధ కలిగించే అంశం. రాఘవ ఏ పని చేసినా, అడ్డదారులు వెతికే అలవాటు. తండ్రి ఇచ్చిన 5…

Read More

Rekha Chithram: ఓటీటీ కి వస్తున్న మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్!

rekha chitram ott movie

ఓటీటీ కి వస్తున్న మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్! మలయాళంలో ఆసిఫ్ అలీ – అనశ్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన “రేఖాచిత్రం“ అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. జనవరి 9న విడుదలైన ఈ సినిమా, ఈ ఏడాది ఆరంభంలో పెద్ద హిట్‌గా నిలిచి కొత్త రికార్డును సృష్టించింది. జోఫిన్ చాకో దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్, ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేసింది. ఇప్పటికే “సోనీ లివ్” ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా, తెలుగులోనూ ప్రసారం అవుతోంది. ఇప్పుడు, తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా “రేఖాచిత్రం” “ఆహా” ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు అధికారిక ప్రకటనతో కూడిన పోస్టర్ విడుదలైంది. ఓటీటీ ద్వారా ఆసిఫ్ అలీ, అనశ్వర రాజన్ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు…

Read More

Sankranthiki Vasthunnam : మార్చి 1న టీవీ, ఓటీటీ ప్రీమియర్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా 

sankranthiki vasthunnam

మార్చి 1న టీవీ, ఓటీటీ ప్రీమియర్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా  సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని ZEE5, ZEE తెలుగు చానళ్లలో ఒకేసారి ప్రీమియర్‌గా ప్రదర్శించనున్నారు. రేపు (మార్చి 1) సాయంత్రం 6 గంటలకు ఈ వినోదభరిత చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో ఘన విజయం సాధించిన అనంతరం, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని ప్రత్యేకంగా ZEE తెలుగులో ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా, ZEE5 ఓటీటీ వేదికపై తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్‌లను కూడా విడుదల చేస్తున్నారు, తద్వారా విభిన్న భాషల ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని ఆస్వాదించే అవకాశం కల్పిస్తున్నారు. వెంకటేశ్ స్పందిస్తూ…‘‘ఈ చిత్రంలో రాజు పాత్ర పోషించడం…

Read More

Game Changer: అమెజాన్ ప్రైమ్‌లోకి వ‌చ్చేస్తోన్న ‘గేమ్ ఛేంజ‌ర్‌’

game changer movie

అమెజాన్ ప్రైమ్‌లోకి వ‌చ్చేస్తోన్న ‘గేమ్ ఛేంజ‌ర్‌’ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ప్రసిద్ధ దర్శకుడు శంకర్ కాంబినేషన్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10 న సంక్రాంటి బహుమతిగా విడుదలైన ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం OTT కి వస్తోంది. ఇది ఈ నెల 7 వ తేదీ నుండి ప్రముఖ OTT ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతుంది. అమెజాన్ ఇటీవల తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తెలుగు, తమిళ మరియు కన్నడ భాషలలో ప్రసారం కానున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రం విడుదలైన 28 రోజులలోపు ఈ చిత్రం OTT కి రావడం గమనార్హం. ఇంతలో, ఈ చిత్రంలో రామ్ నందన్ మరియు రామ్ చరణ్ తండ్రి మరియు కొడుకు పాత్రలు పోషించారు. చరణ్ యొక్క నటనను విమర్శకులు…

Read More