Trivikram : సిరివెన్నెల గారి కారణంగానే తనకు పాటలంటే ఇష్టం ఏర్పడింది : త్రివిక్రమ్ శ్రీనివాస్

త్రివిక్రమ్ శ్రీనివాస్

సిరివెన్నెల గారి కారణంగానే తనకు పాటలంటే ఇష్టం ఏర్పడింది : త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, తనకు సినీ పాటలపై ప్రేమ పెరగడానికి ప్రధాన కారణం సిరివెన్నెల సీతారామశాస్త్రే అని తెలిపారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం చాలా మందికి తెలిసిందే. త్రివిక్రమ్ చెప్పినట్లుగా, సిరివెన్నెల గురించి అంతగా చెప్పగలిగిన వారు చాలా తక్కువ. ఎందుకంటే, వారిద్దరి సంబంధం ఎప్పటికీ ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందన్నారు. ఇటీవల ఆయన మళ్లీ సిరివెన్నెల గురించీ, తనపై ఆయన ప్రభావం గురించీ మాట్లాడారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చే ముందు పాటలపై ఆసక్తి అంతగా ఉండేదే కాదని, కానీ సిరివెన్నెల రచించిన “విధాత తలపున” అనే పాట విన్న తర్వాత తనకు నిజమైన అనుభూతి కలిగిందని చెప్పారు. ఆ పాట తనను అంతగా ఆకర్షించిందని, దానిలోని పదాల అర్థం…

Read More

Ram Charan : లండన్‌ మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహం

ramcharan

విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ఫ్యామిలీ లండన్ ప్రయాణం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోబోతున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా, విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు రామ్ చరణ్ తన కుటుంబంతో కలిసి లండన్‌కి పయనమయ్యారు. వివరాల్లోకి వెళితే, మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖుల మైనపు విగ్రహాలకు పెట్టింది పేరు. ఇప్పుడు, టాలీవుడ్ నుంచి రామ్ చరణ్‌కి ఈ గౌరవం దక్కటం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం. ఈ విగ్రహావిష్కరణ వేడుకకు రామ్ చరణ్‌తో పాటు ఆయన భార్య ఉపాసన కామినేని కొణిదెల, కూతురు క్లీంకార కొణిదెల, తండ్రి మెగాస్టార్ చిరంజీవి మరియు తల్లి సురేఖ లండన్‌కి చేరుకున్నారు. ‘RRR’ చిత్రంతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రామ్…

Read More

Prakash Raj: పాకిస్థాన్ నటుడికి మద్దతు పలికిన ప్రకాశ్ రాజ్

prakash raj

పాకిస్థాన్ నటుడికి మద్దతు పలికిన ప్రకాశ్ రాజ్` సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన సినిమాను భారత్‌లో నిషేధించిన అంశంపై ఆయన విభిన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల కశ్మీర్‌లో చోటుచేసుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న వేళ, ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం, పాకిస్థాన్‌పై పలు ఆంక్షలు విధిస్తూ, ఆ దేశ నటులు పాల్గొన్న చిత్రాలను భారత్‌లో విడుదల చేయకుండా నిషేధించింది. ఈ పరిణామాల్లో భాగంగా, ఫవాద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘అబిర్ గులాల్’ అనే చిత్రం కూడా…

Read More

Trisha : వైరల్ అవుతున్న త్రిష, శింబు సన్నిహితంగా ఉన్న ఫొటో… పెళ్లి అంటూ ప్రచారం

trisha

వైరల్ అవుతున్న త్రిష, శింబు సన్నిహితంగా ఉన్న ఫొటో… పెళ్లి అంటూ ప్రచారం దక్షిణాది సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న త్రిష, తన వ్యక్తిగత జీవనంతో మరోసారి వార్తల్లోకెక్కారు. నలభై ఏళ్లు దాటి కూడా ఇప్పటికీ అవివాహితగా ఉండటంతో ఆమె పెళ్లిపై తరచూ పుకార్లు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. గతంలో సహ నటుడు విజయ్‌తో ఆమెకు ప్రేమలో ఉన్నట్టు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో తమిళ నటుడు శింబుతో త్రిష వివాహం చేసుకోనుందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఇటీవల శింబు, త్రిష కలిసి ఉన్న ఒక ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. ఈ ఫోటోలో ఇద్దరూ చాలా సన్నిహితంగా నవ్వుతూ కనిపించడంతో, వీరి మధ్య ప్రేమ చిగురించిందని, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఆ ఫోటో…

Read More

Rajnikanth | సూపర్ స్టార్ రజనీకాంత్ రిటైర్మెంట్ వార్తలపై ఊహాగానాలు, స్పందించిన రజనీ భార్య లత

rajinikanth

సూపర్ స్టార్ రజనీకాంత్ రిటైర్మెంట్ వార్తలపై ఊహాగానాలు, స్పందించిన రజనీ భార్య లత సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారన్న ఊహాగానాలు తమిళ సినీ వర్గాల్లో జోరుగా చర్చకు వస్తున్నాయి. ప్రస్తుతం ‘కూలీ’, ‘జైలర్ 2’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తరుణంలో, ఇలాంటి వార్తలు మరింత ఆసక్తికరంగా మారాయి. తమిళ పరిశ్రమలో రజనీకాంత్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు. సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ చివరి దశలోకి చేరింది, అలాగే రజనీకాంత్ తన పాత్రను ఇప్పటికే పూర్తి చేశారట. మరోవైపు, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘జైలర్ 2’ కోసం కూడా ఆయన షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే రజనీకాంత్ త్వరలో నటనకు వీడ్కోలు…

Read More

Hit 3 | 4 రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 101కోట్ల‌ పైగా కలెక్ష‌న్స్‌ సాధించిన హిట్ 3

4 రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 101కోట్ల‌ పైగా కలెక్ష‌న్స్‌ సాధించిన హిట్ 3 నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘హిట్ 3’ (హిట్: ది థర్డ్ కేస్), హిట్ సిరీస్‌లో మూడో భాగంగా శైలేశ్ కొలను దర్శకత్వంలో రూపొందింది. మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. విడుదల రోజునే ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని, చిత్రబృందం ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా అధికారికంగా ప్రకటించింది. “సర్కార్ సెంచరీ – 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 101 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు!” అంటూ ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో నానికి జోడీగా…

Read More

Vijay Deverakonda: ఆ వివాదంపై క్లారిటీ.. ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిన‌ విజ‌య్ దేవ‌ర‌కొండ

vijay devarakonda

ఆ వివాదంపై క్లారిటీ.. ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిన‌ విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవ‌ల జరిగిన ‘రెట్రో’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. పాకిస్తాన్ పరిణామాలపై స్పందిస్తూ, “ట్రైబల్స్‌లా కొట్టుకోవడం ఏంటి?” అన్న ఆయన వ్యాఖ్యలు ఆదివాసీ సంఘాల ఆగ్రహానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలతో గిరిజనుల మనోభావాలను దెబ్బతీశారని, అవమానంగా ఉందని ట్రైబల్ జేఏసీ నాయకులు తీవ్రంగా స్పందించారు. గిరిజనుల చరిత్ర, సంస్కృతిని అవమానించేలా వ్యాఖ్యానించడం మానవ విలువలకు విరుద్ధమని వారు అభిప్రాయపడ్డారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ ట్రైబల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు న్యాయవాది కిషన్‌రాజ్ చౌహాన్, ఇతర ప్రతినిధులతో కలిసి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. వివాదం తీవ్రతను గమనించిన విజయ్ దేవరకొండ తాజాగా మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల…

Read More

Ajith Kumar : పాలిటిక్స్ అంటే త‌న‌కు ఆస‌క్తి లేద‌న్న హీరో అజిత్ కుమార్

ajith kumar

పాలిటిక్స్ అంటే త‌న‌కు ఆస‌క్తి లేద‌న్న హీరో అజిత్ కుమార్ తమిళ సినీ నటుడు అజిత్ కుమార్ రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 33 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంలో, రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్న సినీ నటీనటులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, తనకు మాత్రం రాజకీయాల్లో ఏమాత్రం ఆసక్తి లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వస్తూ ప్రజల్లో మార్పు తీసుకురావాలని ఆశించే ప్రతి ఒక్కరికీ విజయం కలగాలని కోరుకుంటానని తెలిపారు. ఈ సందర్భంలో తన సన్నిహితుడు, నటుడు దళపతి విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి రావడాన్ని ప్రస్తావిస్తూ, అది ఒక సాహసోపేతమైన నిర్ణయం అని ప్రశంసించారు. ఇండియా వంటి 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో వేర్వేరు మతాలు, భాషలు, జాతులు కలిగిన ప్రజలు పరస్పర…

Read More

Kushendar Ramesh Reddy: దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో కుశేందర్ రమేశ్‌ రెడ్డి‌కి ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు

kushendar ramesh reddy

ఫిల్మ్ ఫెస్టివల్‌లో కుశేందర్ రమేశ్‌ రెడ్డి‌కి ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు రజాకార్’ చిత్రంలో తన అద్భుతమైన సినిమాటోగ్రఫీతో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన కుశేందర్ రమేశ్‌ రెడ్డికి ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ఈ సినిమాలోని విజువల్స్‌కు విశేషమైన ఆదరణ లభించగా, తాజాగా 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ఆయనకు పురస్కారం లభించింది. కుశేందర్ రమేశ్‌ రెడ్డి కెరీర్‌ను పరిశీలిస్తే, ఆయన కెమెరామెన్షిప్‌ను పటిష్ఠంగా తయారు చేసుకున్న విధానం స్పష్టంగా కనిపిస్తుంది. ‘ఈగ’, ‘బాహుబలి 1 & 2’, ‘ఆర్ఆర్ఆర్‌’ వంటి భారీ చిత్రాల్లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ వద్ద చీఫ్ అసోసియేట్‌గా పని చేసిన ఆయన, అనుభవాన్ని ఆయుధంగా మలచుకుని ఇప్పుడు తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘రజాకార్’ సినిమా ద్వారా దర్శకుడు యాటా సత్యనారాయణ చరిత్రలో దాగి ఉన్న నిజాలను, మరచిపోయిన…

Read More

Allu Arjun: అల్లు అర్జున్ కొత్త సినిమాలో విల్ స్మిత్?

allu arjun will smith

అల్లు అర్జున్ కొత్త సినిమాలో విల్ స్మిత్? అల్లు అర్జున్ తాజా ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ ఈ చిత్రంలో నటించనున్నారన్న ప్రచారం తెరపైకి వచ్చింది. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించనుండగా, విల్ స్మిత్‌ను కీలక పాత్రలో కుదించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఆస్కార్ విజేత అయిన 56 ఏళ్ల విల్ స్మిత్, ‘మెన్ ఇన్ బ్లాక్’ లాంటి గ్లోబల్ హిట్‌లతో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందారు. ఆయన నటనకు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆదరణ ఉంది. ఇటీవలి కాలంలో ఆయన చాలా సెలెక్టివ్‌గా ప్రాజెక్టులను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సినిమాకు ఆయనను ఎంపిక చేసేందుకు అట్లీ బృందం గట్టి ప్రయత్నాలు చేస్తోందని ఇండస్ట్రీ…

Read More