Bunny Vas | బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై నిర్మాత బన్నీ వాసు స్పందన 

bunny vas

నిర్మాత బండ్ల గణేశ్ నోరు విప్పితే సంచలనం ఖాయం. ఆయన వ్యాఖ్యలు తరచూ వివాదాలకు దారి తీస్తుంటాయి. తాజాగా ‘లిటిల్ హార్ట్స్’ సినిమా విజయోత్సవ సభలో ఆయన చేసిన పరోక్ష వ్యాఖ్యలు మరోసారి తెలుగు సినిమా పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. ఆ వ్యాఖ్యల వల్ల తాను తీవ్రంగా బాధపడ్డానని, ఆ వేడుకలోని సంతోష వాతావరణం పూర్తిగా మాయమైందని నిర్మాత బన్నీ వాసు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఆవేదన వ్యక్తం చేశారు. వివాదానికి కారణమైన వ్యాఖ్యలు ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ మీట్‌లో బండ్ల గణేశ్ మాట్లాడుతూ, “ఇండస్ట్రీలో అందరూ మెగాస్టార్ బావమరిదిలా, స్టార్ కమెడియన్ కొడుకులా, ఐకాన్ స్టార్ తండ్రిలా పుట్టరు. అది కొందరికే దక్కే అదృష్టం. మిగిలిన వాళ్లు ఎంత కష్టపడినా చివరికి పేరు మాత్రం వాళ్లకే వెళ్తుంది,” అని అన్నారు.  ఈ వ్యాఖ్యలు అగ్ర నిర్మాత అల్లు…

Read More

Ram Gopal Varma | 36 ఏళ్ల తర్వాత ‘శివ’పై వర్మ కొత్త విశ్లేషణ

rgv

రీ–రిలీజ్ కోసం సినిమా చూస్తుండగా కొత్త అర్థం దొరికిందన్న ఆర్జీవీ “శివ ఒక మనిషి కాదు, భయానికి లొంగని ఒక సిద్ధాంతం” ఆత్మగౌరవం విషయంలో శివ ఆలోచనల్లో గాంధేయత ఉంది “శివ మౌనం అతిపెద్ద ఆయుధం” – వర్మ “అందుకే 36 ఏళ్లైనా శివను ఎవరూ మర్చిపోలేదు” తెలుగు సినిమా చరిత్రలో ఒక యుగాన్ని మార్చిన చిత్రం ‘శివ’. ఆ సినిమా విడుదలై 36 ఏళ్లు పూర్తవుతున్న వేళ, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ‘శివ’పై కొత్తగా ఆలోచించిన విషయాలను పంచుకున్నారు. నాగార్జున కెరీర్‌కు మలుపు తిప్పిన ఈ సినిమా, వర్మకు దర్శకుడిగా గుర్తింపును తెచ్చింది. ఇప్పుడు రీ–రిలీజ్ సందర్భంగా మళ్లీ చూసినప్పుడు, 26 ఏళ్ల వయసులో తాను ఊహించి సృష్టించిన శివ పాత్రను, 62 ఏళ్ల వయసులో పూర్తిగా అర్థం చేసుకున్నానని వర్మ చెప్పారు.…

Read More

‘హరిహర వీరమల్లు’ విడుదల వాయిదాపై క్లారిటీ – నిర్మాణ సంస్థ కీలక ప్రకటన!

hari hara veera mallu

‘హరిహర వీరమల్లు’ విడుదల వాయిదాపై క్లారిటీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ పార్ట్ 1 విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో, సినిమా కొత్త విడుదల తేదీ గురించి అంతర్జాలంలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 26న లేదా జూలై మొదటి వారంలో సినిమా విడుదల కావచ్చని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాలపై ‘హరిహర వీరమల్లు’ చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ తాజాగా స్పందించింది. వదంతులు నమ్మొద్దు: మెగా సూర్య ప్రొడక్షన్స్ సినిమా విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని నిర్మాణ…

Read More

బాలకృష్ణ ‘అఖండ 2’ టీజర్: పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టిన బాలయ్య

akhanda teaser

బాలయ్య బర్త్‌డే గిఫ్ట్ వైరల్! నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అఖండ 2’ సినిమా టీజర్ సోమవారం విడుదలైంది. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ ప్రత్యేక కానుకను అభిమానులకు అందించింది. విడుదలైన కొద్దిసేపటికే ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. టీజర్‌లో బాలకృష్ణ తనదైన శైలిలో పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టారని, ఆయన లుక్ కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోందని టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు, ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ప్రాణం పోసిందని, గూస్‌బంప్స్ తెప్పించేలా ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు. బాలకృష్ణ చెప్పిన సంభాషణలు, టీజర్‌లోని విజువల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. గతంలో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’,…

Read More

OG | పవన్ కల్యాణ్ ఓజీ చిత్రంలో నటుడు నారా రోహిత్ కాబోయే భార్య శిరీష

OG

 పవన్ కల్యాణ్ ఓజీ చిత్రంలో నటుడు నారా రోహిత్ కాబోయే భార్య శిరీష పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘ఓజీ’ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.  ఇటీవల ఈ చిత్రంలో నటుడు నారా రోహిత్ కాబోయే భార్య శిరీష నటిస్తున్నారనే వార్తలు వినిపించగా, ఇప్పుడు ఈ విషయం నేరుగా నారా రోహిత్ ధృవీకరించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్‌లతో కలిసి నటించిన ‘భైరవం’ సినిమా ప్రమోషన్లలో నారా రోహిత్ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోహిత్, సాయి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, “‘ఓజీ’లో నా కాబోయే భార్య శిరీష ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది” అని తెలిపారు. ఈ ప్రకటనతో శిరీష…

Read More

Ram Charan | రామ్ చరణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా

ramcharan trivikram combo

రామ్ చరణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రాబోతోందన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ సంచలనమైన అప్‌డేట్ సినీ వర్గాల్లో కూడా విశేష ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది. ఈ సినిమా పూర్తైన వెంటనే, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోందని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో ఒక సినిమా అధికారికంగా ఇప్పటికే ప్రకటించబడింది. ఈ ప్రాజెక్ట్‌తో పాటు త్రివిక్రమ్ సినిమా కూడా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయని సమాచారం.…

Read More

Archana | ఆయనే నా పేరును ‘అర్చన’ అని మార్చారు : నటి అర్చన

archana

ఆయనే నా పేరును ‘అర్చన’ అని మార్చారు : నటి అర్చన ‘అర్చన’ అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చే సినిమా ‘నిరీక్షణ’. బాలూ మహేంద్ర దర్శకత్వంలో 1982లో విడుదలైన ఈ చిత్రం కథా, కథనాల పరంగా తెలుగు సినీ ప్రపంచాన్ని ఓ కొత్త దిశగా తీసుకెళ్లింది. ఈ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు పొందిన అర్చన, ఆ తర్వాత ‘లేడీస్ టైలర్’ సినిమాలోనూ తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె రాజేంద్రప్రసాద్‌తో కలిసి నటించిన సినిమా ‘షష్ఠి పూర్తి’ ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్చన మాట్లాడుతూ:“నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న తర్వాతనే నటన వైపు వచ్చాను. మా అమ్మవారి కుటుంబం ఆంధ్రప్రదేశ్‌కి చెందినదే కావడంతో, నాకు తెలుగు బాగా వస్తుంది.…

Read More

Harihara Veeramallu | హరిహర విరమల్లు నుంచి ‘తార తార నా క‌ళ్లు’ సాంగ్ విడుదల

nidhi aggarwal

హరిహర విరమల్లు నుంచి ‘తార తార నా క‌ళ్లు’ సాంగ్ విడుదల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరిహర వీరమల్లు‘ నుంచి మరో పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటివరకు విడుదలైన ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’, ‘అసుర హననం’ పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని హీరోయిన్ నిధి అగర్వాల్ పాటను విడుదల చేశారు. ‘తార తార నా కళ్ళు.. వెన్నెల పూత నా ఒళ్లు’ అంటూ సాగే ఈ పాటకు శ్రీహర్ష లిరిక్స్ అందించగా, లిప్సికా మరియు ఆదిత్య అయ్యంగార్ ఆలపించారు. ఈ పాటలో నిధి అగర్వాల్ తన అందంతో ఆకట్టుకుంది. ఈ సినిమా రెండు పార్టులుగా రూపొందుతోంది. మొదటి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో జూన్ 12న వరల్డ్‌వైడ్‌గా…

Read More

Hanshita Reddy : ఇంట్లోనే తల్లి విగ్రహం ఏర్పాటు చేసిన దిల్ రాజు కుమార్తె హన్షిత

dil raju daughter

ఇంట్లోనే తల్లి విగ్రహం ఏర్పాటు చేసిన దిల్ రాజు కుమార్తె హన్షిత టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుమార్తె హన్షిత మదర్స్ డే సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ భావోద్వేగమైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే, హన్షిత తల్లి అనిత గుండెపోటుతో కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. తల్లి ఇకలేను అన్న సంగతి ఎంత కఠినమైనదైనా, ఆమె జ్ఞాపకాలను చిరకాలం సజీవంగా ఉంచేందుకు హన్షిత తన ఇంట్లోనే తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. మదర్స్ డే సందర్భంగా ఆ విగ్రహాన్ని హత్తుకుంటూ తల్లి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరిచింది. ఈ సందర్భంగా హన్షిత తల్లి విగ్రహం ముందు తన కూతురు ఇషితా, తాతమ్మతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ “నాలుగు తరాలు” అని క్యాప్షన్ జత చేసింది. ఆ ఫోటో…

Read More

Pawan Kalyan : ప‌వ‌న్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’పై కీల‌క అప్‌డేట్‌

og

ప‌వ‌న్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’పై కీల‌క అప్‌డేట్‌ పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్‌ మరియు యువ దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ తిరిగి సెట్స్ పైకి వచ్చింది. కొంతకాలంగా షూటింగ్ నిలిచిపోయిన ఈ చిత్రం తాజాగా మళ్లీ ప్రారంభమైందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.  ఈ సందర్భంగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షూటింగ్ స్టార్ట్ అయిన ఫోటోను అభిమానులతో షేర్ చేస్తూ, “మళ్లీ మొదలైంది… ఈసారి ముగిద్దాం” అనే క్యాప్షన్ జత చేశారు. తాజా షెడ్యూల్‌లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారా లేదా అన్నది మాత్రం అధికారికంగా తెలియరాలేదు. అయితే పవన్ ఎప్పుడు సెట్లో చేరతారన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది. అయితే, ‘ఓజీ’ షూటింగ్ రీషార్ట్ అయ్యిందనే వార్తే పవర్ స్టార్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేపిందనడం తప్పు కాదు. ఈ…

Read More